విశ్వక్ సేన్ ‘గామి‘ని పొగడ్తలతో ముంచెత్తిన ప్రభాస్

రెబెల్ స్టార్ ప్రభాస్ నుంచి కాంప్లిమెంట్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. తన సినిమాల ప్రచారంలోనే అరుదుగా కనిపించే ప్రభాస్.. ఇప్పుడు విశ్వక్ సేన్ నటించిన ‘గామి‘ని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. ‘గామి‘ టీజర్.. ఆ తర్వాత ట్రైలర్ చూసి ఎంతో ఎగ్జైట్ అయ్యాడట రెబెల్ స్టార్. దీంతో.. వెంటనే ఓ వీడియో బైట్ ద్వారా ‘గామి‘ గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

‘గామి‘ మూవీ ట్రైలర్ లో అందరి హార్డ్ వర్క్ కనిపిస్తోందని ప్రభాస్ తన వీడియో బైట్ లో చెప్పాడు. సినిమాకు పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పడంతో పాటు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నానని ప్రభాస్ వెల్లడించాడు. మహాశివరాత్రి కానుకగా మార్చి 8న ‘గామి‘ విడుదలకు ముస్తాబవుతోంది. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రం ప్రభాస్ ఓన్ ప్రొడక్షన్ వంటి యు.వి.క్రియేషన్స్ ద్వారా విడుదలవుతుండడం. మొత్తానికి ప్రచార చిత్రాలతో అందరిలోనూ అంచనాలు పెంచేసిన ‘గామి‘ విడుదల తర్వాత ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

Related Posts