హైదరాబాద్ లో ల్యాండైన ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. మోకాలి సర్జరీ నిమిత్తం రెండు నెలల పాటు యూరప్ లో ఉన్న ప్రభాస్ తాజాగా హైదరాబాద్ వచ్చాడు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక.. ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘సలార్‘ డిసెంబర్ 22న విడుదలకు ముస్తాబవుతోంది. ప్రభాస్ రావడంతో ఇప్పుడు ‘సలార్‘ ప్రమోషన్స్ లో స్పీడు పెంచనుంది చిత్రబృందం.

మరోవైపు ప్రభాస్ లేకుండానే మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రభాస్ మరికొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడట. ఇక.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కల్కి 2898 ఎడి‘ షూట్ లోనూ ప్రభాస్ పాల్గొనాల్సి ఉంది. మొత్తంమీద.. ఇకపై తన సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్ విషయంలో జోరు పెంచబోతున్నాడట పాన్ ఇండియా స్టార్.

Related Posts