యాక్షన్ సీక్వెన్సుల్లో ‘టైగర్ 3‘ రికార్డు

స్టార్ హీరోస్ నటించే సినిమాల్లో ఐదారు యాక్షన్ బ్లాక్స్ ఉండడం కామన్. అయితే.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3‘లో ఏకంగా 12 యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయట. ఇప్పటివరకూ అత్యధిక యాక్షన్ సీక్వెన్సులున్న చిత్రంగా ‘టైగర్ 3‘ రికార్డు సృష్టించనుందట.

హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు మించిన రీతిలో ఈ సినిమాలోని హై వోల్టేజ్ స్టంట్స్ ను కంపోజ్ చేసినట్టు టీమ్ తెలిపింది. టైగర్ పాత్రలో సల్మాన్.. జోయాగా కత్రిన కైఫ్ చేసే స్టంట్స్ ఫ్యాన్స్ ను సీట్ ఎడ్జ్ న కూర్చోబెట్టేలా ఉంటాయట. ఇక ఈ సినిమాకి అద్భుతమైన క్లైమాక్స్ ఉంటుందట. ఐమ్యాక్స్‌ ఫార్మాట్ లో చూస్తే ఆ యాక్షన్ సీన్స్‌ అందరినీ అబ్బురపరుస్తాయని చిత్రబృందం చెబుతోంది.

యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్ లో భాగంగా వస్తోన్న ‘టైగర్ 3‘ చిత్రానికి మనీష్ శర్మ దర్శకుడు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించబోతున్నాడు. రేవతి, రిధి డోగ్రా, విశాల్ జెత్వా ఇతర కీ రోల్స్ లో సందడి చేయబోతున్నారు.

యష్ రాజ్ స్పై యూనివర్శ్ గత చిత్రాల హీరోలు షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ లు కూడా ‘టైగర్ 3‘లో కేమియోస్ లో మురిపించబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. దీపావళి కానుకగా నవంబర్ 12న ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts