‘నా సామిరంగ‘ ట్రైలర్.. ఈ పాలి సంక్రాంతి పండక్కి మాస్ జాతరే!

మిగతా సీజన్ల కంటే ఈమధ్య సంక్రాంతి బరిలో కింగ్ నాగార్జునకు సూపర్ హిట్స్ దక్కుతున్నాయి. 2016, 2022 సంక్రాంతి సీజన్లలో ‘సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు’ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఇప్పుడు మళ్లీ అదే తరహా జానర్లో ‘నా సామిరంగ’ చిత్రంతో వస్తున్నాడు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ తో అంచనాలు పెంచేసిన ‘నా సామిరంగ‘ నుంచి ట్రైలర్ వచ్చింది.

‘నా సామిరంగ‘ ట్రైలర్ చూస్తే.. అసలు సిసలు పండగ సినిమా ఇదే అనే అనుభూతి కలుగుతుంది. పల్లెటూరి వాతావరణం, అందులోని అందాలతో కలర్ ఫుల్ గా ‘నా సామిరంగ‘ రూపొందినట్టు అర్థమవుతోంది. కిష్టయ్య పాత్రలో కింగ్ నాగార్జున పక్కా మాస్ అవతార్ లో అదరగొడుతున్నాడు. అతని స్నేహితులుగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ పాత్రలు కనిపిస్తున్నాయి. హీరోయిన్ ఆషిక రంగనాథ్ కూడా ప్రాధాన్యత గల పాత్రలో కనువిందు చేయబోతున్నట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్షన్ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ మలయాళం చిత్రం రీమేక్ గా రూపొందినా.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ సినిమాలో చాలా మార్పులే చేసినట్టు కనిపిస్తుంది. మొత్తంగా.. ఈపాలి సంక్రాంతి పండక్కి కిష్టయ్య వస్తున్నాడు. ఇక మాస్ జాతరే.

Related Posts