బ్లాక్ బస్టర్ డేట్ కే రాబోతున్న ‘కల్కి‘

తెలుగు చిత్ర పరిశ్రమలో వైజయంతీ మూవీస్ ది ఎంతో ప్రత్యేక స్థానం. దాదాపు ఐదు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతోన్న వైజయంతీ నుంచి ఇప్పుడు పాన్ వరల్డ్ రేంజులో రాబోతున్న చిత్రం ‘కల్కి 2898 ఎడి‘. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బాలీవుడ్ వెటరన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు.. విశ్వ నటుడు కమల్ హాసన్, బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తుంది.

ఇప్పటికే చాలాభాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘కల్కి 2898 ఎడి‘ మూవీని ఈ ఏడాది మే 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుందట నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్. మే 9.. వైజయంతీ సంస్థకు సెంటిమెంట్ డేట్. గతంలో ఇదే డేట్ కి ఇదే సంస్థ నుంచి వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి‘ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్స్ సాధించాయి. ఇప్పుడు ఆ సెంటిమెంట్ తోనే ‘కల్కి‘ని ఈ ఏడాది మే 9కి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. కాస్త విరామం తర్వాత మళ్లీ ఈరోజు నుంచే ‘కల్కి‘ షూటింగ్ షురూ అయ్యిందట.

Related Posts