Samantha : నయనతారలా నాకూ యంగ్ హీరోలే కావాలంటోన్న సమంత

ఒకప్పుడు మోస్ట్ టాలెంటెడ్ నటి అనిపించుకున్న బ్యూటీ సమంతరూత్ ప్రభు. 2011లో వెండితెర ఎంట్రీ ఇచ్చిన ఈ డస్కీ బ్యూటీ ఆ తర్వాత తెలుగు, తమిళ్ లో గెల్డెన్ లెగ్ అనిపించుకుంది. అందరు టాప్ హీరోలతో జత కట్టింది. తన టైమ్ లో లేని లిప్ లాక్ లకూ ఓకే చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఇంకా చెబితే మొదటి సినిమాలోనే అధర చుంబనాలతో అదరగొట్టింది. ఇక మొదటి సినిమా నుంచీ ప్రేమ అని చెప్పుకుని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. బట్ నాలుగేళ్లకే ఈ పెళ్లి పెటాలకులైంది. కట్ చేస్తే ఇప్పుడు తను మళ్లీ సినిమాలతో ఫుల బిజీ అవుతోంది.

తెలుగుతో పాటు హిందీలోనూ ఆఫర్స్ అందుకుంటోంది. అయితే కొన్ని రోజులుగా చూస్తే అమ్మడు ఎక్కువగా యంగ్ హీరోలతోనే జతకడుతూ కనిపిస్తోంది. ఇది తన డిమాండా లేక అలా వచ్చేస్తున్నాయా అనే డౌట్ వస్తే మాత్రం మనం క్లారిఫైచేసుకోవాలి కదా..?

మజిలీ తర్వాత విడుదలైన థియేట్రికల్ మూవీ యశోదలో తనకు హీరో ఉండడు. బట్ రీసెంట్ గా వచ్చిన శాకుంతలంలో హీరో ఆమెకంటే చాలా చిన్నవాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ఈ కుర్రాడు అచ్చంగా సమంత వయసువాడే. ఇద్దరి మధ్య కేలం నాలుగు రోజుల గ్యాప్ ఉంది. ఆ నాలుగు రోజులూ వరుణే పెద్ద. ఈ వయసు హీరోలను మనం కుర్రాళ్లనే కదా అంటాం.

ఈ యేడాది సెప్టెంబర్ 1న విడుదల కాబోతోన్న ‘ఖుషీ’ హీరో విజయ్ దేవరకొండ.. సమంత కంటే మూడేళ్లు చిన్నవాడు. ఇద్దరూ కలిసి గతంలో మహానటి సినిమాలో నటించారు. ఈ సారి జోడీగా నటించారు.
ఇక త్వరలోనే తెలుగులో సిద్ధు జొన్నలగడ్డతో ఓ సినిమా చేయబోతోందనే వార్తలు వస్తున్నాయి. ఇతనూ వయసులో సమంత కంటే కాస్త చిన్నవాడే.

ఇలా ప్రస్తుతం తను చేస్తోన్న సినిమాలన్నిటిలోనూ హీరోలు యంగ్ స్టర్సే. తను సీనియర్ హీరోలకు పెద్దగా ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదు అనే టాక్ వినిపిస్తోంది.

నిజానికి సమంత స్టార్డమ్ ముందు కూడా ఈ హీరోలంతా చిన్నవాళ్లే. ఇలాంటప్పుడు సినిమా కథలు ఎక్కువగా ఆ హీరోయిన్ల చుట్టూ తిరుగుతాయి. రొమాన్స్ విషయంలో తాము ఎన్ని కండీషన్స్ అయినా పెట్టొచ్చు. లేదా డిమాండ్ చేయొచ్చు. అటు ఆడియన్స్ ఫోకస్ కూడా హీరో కంటే ఎక్కువగా ఇలాంటి సీనియర్ హీరోయిన్లపైనే ఉంటుంది. అందుకే సమంత ఈ రూట్ ఎంచుకుందా అనుకుంటున్నారు కొందరు.

ఇక విశేషం ఏంటంటే.. ప్రేమలో రెండుసార్లుఫెయిల్ అయిన తర్వాత ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటోన్న నయనతార కూడా అప్పట్లో సీనియర్ హీరోస్ కు నో ఎంట్రీ అనే బోర్డ్ పెట్టింది. అంటే కేవలం యంగ్ స్టర్స్ తో మాత్రమే నటించింది.

అలా చేయడం వల్లే తనకు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా వచ్చాయి. అప్పటి వరకూ చేసిన విపరీతమైన ఎక్స్ పోజింగ్ కూడా ఈ బలమైన పాత్రల మధ్య గుర్తుకు రాకుండా పోయింది. చూస్తోంటే సమంత కూడా నయన్ రూట్ నే ఎంచుకున్నట్టు కనిపిస్తోంది కదూ..?

Related Posts