‘ప్రతినిధి 2’కి సెన్సార్ ఇబ్బందులేంటి?

ప్రస్తుతం యావత్ దేశంలో ఎన్నికల హడావుడి జోరుగా ఉంది. ముఖ్యంగా.. ఆంధ్రప్రదేశ్ లో అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ ఎన్నికలు ఉండడంతో వాతావరణం ఇంకా రసవత్తరంగా ఉంది. దీంతో.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను టార్గెట్ చేస్తూ పలు రాజకీయ చిత్రాలు రూపొందాయి. ఇప్పటికే విడుదలయ్యాయి కూడా. అయితే.. ఈ సినిమాలలో మంచి స్టార్ కాస్ట్ తో రాబోతున్న మూవీ ‘ప్రతినిధి 2’. నారా రోహిత్ దాదాపు ఆరు సంవత్సరాల గ్యాప్ తర్వాత నటించిన సినిమా ఇది. పైగా.. పాపులర్ జర్నలిస్ట్ మూర్తి డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందింది.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ‘ప్రతినిధి 2’.. అసలు ఏప్రిల్ 25న ఆడియన్స్ ముందుకు రావాల్సి ఉంది. అయితే.. సెన్సార్ ఆఫీసర్ సెలవులో ఉన్న కారణంగా ‘ప్రతినిధి 2’ వాయిదా పడాల్సి వచ్చింది. ఇప్పుడు సెన్సార్ ఆఫీసర్ రావడం.. సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడం కూడా జరిగిందట. కానీ.. సర్టిఫికెట్ ఇష్యూ చేయడానికే తటపటాయిస్తున్నారట. ‘ప్రతినిధి 2’కి సర్టిఫికెట్ ఎందుకు జారీ చేయడం లేదనేదే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ ఏమైనా కట్స్ తో సర్టిఫికెట్ జారీ చేస్తారా? లేక రివైజింగ్ కమిటీకి పంపిస్తారా? అనే ప్రచారం కూడా జరుగుతోంది. మే 10న విడుదల తేదీ ఖరారు చేసుకున్న ‘ప్రతినిధి 2’ సెన్సార్ సర్టిఫికెట్ పై త్వరలో క్లారిటీ అవకాశముంది

Related Posts