Featured

రివ్యూ.. హిట్ కొట్టిన ‘కోట బొమ్మాళి పీఎస్‘

తారాగణం : శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ తదితరులు
సంగీతం : రంజిన్ రాజ్, మిథున్ ముకుందన్
సినిమాటోగ్రఫీ : జగదీష్ చీకటి
నిర్మాతలు : బన్నీ వాసు, విద్యా కొప్పినీడి
దర్శకత్వం : తేజ మార్ని
విడుదల తేదీ : 24-11-2023

రొటీన్ కమర్షియల్ మూవీస్ కంటే కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ కి ఎప్పుడూ పెద్ద పీట వేస్తుంటారు ఆడియన్స్. ఈకోవలోనే ఈరోజు ఆడియన్స్ ముందుకొచ్చిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‘. మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన ‘నాయట్టు‘కి ఇది అఫీషియల్ రీమేక్. శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో తేజ మార్ని తెరకెక్కించిన ఈ సినిమాని గీతా ఆర్ట్స్ 2 నిర్మించింది. మరి.. ఎన్నో అంచనాలతో వచ్చిన ‘కోట బొమ్మాళి పీఎస్‘ ఎలా ఉంది?

కథ:
‘కోట బొమ్మాళి‘ అనే గ్రామంలో ఉన్న పోలీస్ స్టేషన్ ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో శ్రీకాంత్ హెడ్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించాడు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ కానిస్టేబుల్స్ గా నటించారు. కొంతమంది పొలిటికల్ లీడర్స్ తమ స్వలాభం కోసం పన్నిన వలలో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ ఎలా చిక్కుకున్నారు? ఈ పోలీసులను పట్టుకోవడానికి మరికొందరు పోలీసులు విలన్లుగా ఎందుకు మారాల్సి వచ్చింది అనేదే కథ.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
‘ఖడ్గం‘ సినిమా తర్వాత పోలీసాఫీసర్ గా మరోసారి తన పవర్ చూపించాడు శ్రీకాంత్. ముఖ్యంగా శ్రీకాంత్‌, వరలక్ష్మి మధ్య వచ్చే సీన్స్ బాగా కుదిరాయి. వీరిద్దరి మధ్య సన్నివేశాలు రేసీగా.. ప్రేక్షకుల్ని సీట్లకు అతుక్కుపోయేలా చేస్తాయి. చాలాకాలం తర్వాత శ్రీకాంత్‌ కి గుర్తుండిపోయే పాత్ర ఈ సినిమాలో దక్కింది. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక నిపుణుల విషయానికొస్తే దర్శకుడు తేజ మార్నిని మెచ్చుకోవాలి. ఒరిజినల్ లోని ఆత్మని మాత్రమే తీసుకుని.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా సినిమాని తీర్చిదిద్దిన విధానం బాగుంది. సంగీతం పరంగా ‘లింగి లింగి లింగిడి‘ సాంగ్ విడుదలకు ముందే పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఈ పాట విజువల్ గానూ ఆకట్టుకునేలా ఉంది. ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ న కూర్చోబెట్టేలా అందించిన నేపథ్యం సంగీతం బాగుంది. సినిమాటోగ్రాఫర్ జగదీష్ చీకటి కొన్ని సన్నివేశాల్లో తన విజువల్స్ తో మెస్మరైజ్ చేస్తాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2 నిర్మాణ విలువలు ప్రతీ ఫ్రేములో కనిపిస్తాయి. చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో నిర్మాణ సంస్థ సఫలీకృతమైందని చెప్పాలి. మొత్తంమీద.. ‘కోట బొమ్మాళి పీఎస్‘ హిట్ కొట్టింది.

Telugu 70mm

Recent Posts

వి.ఎఫ్.ఎక్స్ పనులు పూర్తిచేసుకున్న విజయ్ ‘గోట్’

తమిళ దళపతి విజయ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక..…

2 mins ago

‘కల్కి’ సినిమా మొత్తానికి ఒకటే పాట?

ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీ మూవీస్ లో 'కల్కి 2898 ఎ.డి.' ఒకటి. జూన్…

25 mins ago

రేపటి నుంచి మళ్లీ రంగంలోకి నటసింహం

నటసింహం బాలకృష్ణ కమిట్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్లాపుల్లో ఉన్నప్పుడే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను లైన్లో…

46 mins ago

‘దేవర’ మొదటి పాట కోత.. రెండో పాట లేత

'దేవర' నుంచి మొదటి పాట మాత్రమే కాదు.. రెండో పాట కూడా బోనస్ గా రాబోతుంది. 'దేవర' నుంచి ఫస్ట్…

3 hours ago

నాని-సుజీత్ సినిమాపై కొనసాగుతోన్న సస్పెన్స్

నేచురల్ స్టార్ నాని మంచి దూకుడు మీదున్నాడు. 'శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న'లతో వరుస విజయాలను…

4 hours ago

బుల్లితెర నటుడు చందు జీవితంలో మరో కోణం

బుల్లితెర నటుడు చందు ఆత్మహత్య సంచలనం సృష్టించింది. సీరియల్ నటి పవిత్ర కార్ యాక్సిడెంట్ లో మరణించడం వలనే చందు…

4 hours ago