కల్కి 2898ఎడి సెట్ లో కమల్ హాసన్

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ చిత్రం ‘కల్కి 2898ఎడి’. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, దిశా పటాని కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అలాగే, తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నారు. కాగా, కమల్ హాసన్ కల్కి షూటింగ్ లో పాల్గొంటున్నట్టుగా తాజా సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ లేటెస్ట్ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. అగ్ర నిర్మాత అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Related Posts