Featured

అమరావతి వేదికగా ‘కల్కి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు దీరుతుంది. దాంతో.. ఇకపై అక్కడ సినిమాలకు సంబంధించిన ఆంక్షలు పెద్దగా ఉండవనే ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా.. ఈనెలలో రాబోతున్న పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి’ బెనిఫిట్ షోస్ కి ఆంధ్రాలో లైన్ క్లియర్ అయినట్టే అనే టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రభాస్ గత చిత్రం ‘సలార్’ కోసం తెలంగాణలో తెల్లవారుజామునే 1 గంట నుంచి ప్రీమియర్స్ పడ్డాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ‘కల్కి’తో ఇలాంటి బెనిఫిట్ షోస్ కి శ్రీకారం జరగబోతుందనేది ఇండస్ట్రీ టాక్.

మరోవైపు.. ‘కల్కి’ ట్రైలర్ విడుదలైన అన్ని భాషల్లోనూ ట్రెమండస్ రెస్పాన్స్ దక్కించుకుంటుంది. నెవర్ బిఫోర్ విజువల్ వండర్ లా ట్రైలర్ కి అంతటా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఇక.. విడుదలకు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉండడంతో ప్రచారంలో స్పీడు పెంచాలని భావిస్తున్నారు మేకర్స్. ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి వేదికగా భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. త్వరలోనే.. ఈ గ్రాండ్ ఈవెంట్ కి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది. అలాగే.. ఉత్తరాదిన సైతం ‘కల్కి’ కోసం వరుస ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తున్నారట.

Telugu 70mm

Recent Posts

Pragya Jaiswal

6 hours ago

Honey Rose

6 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో సుధీర్ బాబు కొత్త చిత్రం

తెలుగు కథానాయకుల్లో అసలు సిసలు యాక్షన్ హీరో అనిపించుకునే క్వాలిటీస్ సుధీర్ బాబు కి పుష్కలంగా ఉన్నాయి. అందుకు ప్రధాన…

6 hours ago

Nabha Natesh

7 hours ago

‘డబుల్ ఇస్మార్ట్‘ నుంచి ‘స్టెప్పామార్‘ వచ్చేసింది

ఉస్తాద్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో రూపొందుతోన్న క్రేజీ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్‘. ‘ఇస్మార్ట్ శంకర్‘కి సీక్వెల్…

7 hours ago

ఆగస్టు 15 రేసులోకి విక్రమ్ ‘తంగలాన్‘

ఈ ఏడాది ప్రథమార్థంలో పెద్ద హీరోలు నటించిన చిత్రాలేవి పెద్దగా రాలేదు. అయితే.. ద్వితియార్థంలో మాత్రం వరుసగా బడా హీరోలంతా…

7 hours ago