Featured

ప్రభాస్ కోసం వెలిసిన కొత్త ప్రపంచం ‘కల్కి’

సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త సామ్రాజ్యాలు వెలుస్తున్నాయి. క్రియేటివిటీ ఎల్లలు దాటడమంటే ఇదే. హాలీవుడ్ లో తమ సినిమాలకోసం కొత్త ప్రపంచాలు సృష్టించడం చూస్తూనే ఉంటాం. ‘అవతార్’ కోసం పండోరా అనే ఓ గ్రహాన్నే సృష్టించాడు డైరెక్టర్ జేమ్స్ కామెరాన్. ఇప్పుడు మన మేకర్స్ న్యూ వరల్డ్స్ పై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కోసం కొత్త ప్రపంచాలు సృష్టిస్తున్నారు.

‘బాహుబలి’ సినిమాకోసం మాహిష్మతి సామ్రాజ్యాన్ని సృష్టించాడు దర్శకధీరుడు రాజమౌళి. అయితే.. మాహిష్మతి అనే సామ్రాజ్యం పేరు మన చరిత్రలో ఉంది. కానీ.. ఆ సామ్రాజ్యం మన జక్కన్న సృష్టించినంత పెద్దగా ఉంటుందని చెప్పలేం. ఏదేమైనా.. మాహిష్మతి అనే పేరును ‘బాహుబలి’తో బ్రాండ్ నేమ్ గా మార్చేశాడు రాజమౌళి.

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ కోసమే మరో కొత్త సామ్రాజ్యం సృష్టించబడింది. దాని పేరు వాజీ సిటీ. ఈ కలల సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసింది సుజీత్. ‘సాహో’ సినిమాకోసం సుజీత్ వాజీ సిటీని అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు. సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించకపోయినా.. ఈ సినిమా స్టోరీ లైన్, ప్రభాస్ ను ప్రెజెంట్ చేసిన విధానానికి అందరూ ఫిదా అయ్యారు.

ఆ తర్వాత ‘సలార్’ కోసం మరో సామ్రాజ్యం వెండితెరపై ఆవిష్కృతమైంది. అదే ఖాన్సార్ సామ్రాజ్యం. వెయ్యేళ్ల క్రితం భారత ఉపఖండంలో కొన్ని తెగలు స్థాపించిన సామ్రాజ్యంగా ఖాన్సార్ ని తెరపైకి తీసుకొచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఖాన్సార్ సామ్రాజ్యం.. అందులోని తెగలు.. వారి పరిపాలనా నిబంధనలు.. అన్నీ తానే సృష్టించి.. ఓ కొత్త ప్రపంచానికి వెండితెరపై జీవం పోశాడు.

ప్రభాస్ మరో మూవీ ‘కల్కి’లోనూ ఇలాంటి సామ్రాజ్యాన్నే సృష్టించాడట డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఎపిక్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ కథాంశం 2898 ఎ.డి.లో జరుగుతుంది. అంటే.. అప్పటి కాలామానానికి అనుగుణంగా.. అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా.. అప్పటి సంస్కృతి సంప్రదాయాలను ఆవిష్కరించేలా.. ఓ ప్రపంచాన్ని ‘కల్కి’ కోసం సృష్టించాడట నాగ్ అశ్విన్.

లేటెస్ట్ గా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్యూలో ‘కల్కి 2898 ఎ.డి.’ని చూసి థియేటర్ నుండి బయటికి వచ్చినప్పుడు ఆడియెన్స్ వింతగా భావిస్తారని తాను ఆశిస్తున్నట్టు తెలిపాడు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు తాము వేరే ప్రపంచం నుంచి మళ్లీ ఈ ప్రపంచంలోకి వచ్చినట్టు ఫీల్ అవుతారని’ నాగ్ అశ్విన్ అన్నాడు. జేమ్స్ కామెరాన్ ‘అవతార్’ చూసిన తర్వాత నాగ్ అశ్విన్ కూడా అదే విధంగా ఫీల్ అయినట్లు తెలిపాడు.

Telugu70mm

Recent Posts

Pragya Jaiswal

5 hours ago

Honey Rose

5 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో సుధీర్ బాబు కొత్త చిత్రం

తెలుగు కథానాయకుల్లో అసలు సిసలు యాక్షన్ హీరో అనిపించుకునే క్వాలిటీస్ సుధీర్ బాబు కి పుష్కలంగా ఉన్నాయి. అందుకు ప్రధాన…

6 hours ago

Nabha Natesh

6 hours ago

‘డబుల్ ఇస్మార్ట్‘ నుంచి ‘స్టెప్పామార్‘ వచ్చేసింది

ఉస్తాద్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో రూపొందుతోన్న క్రేజీ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్‘. ‘ఇస్మార్ట్ శంకర్‘కి సీక్వెల్…

7 hours ago

ఆగస్టు 15 రేసులోకి విక్రమ్ ‘తంగలాన్‘

ఈ ఏడాది ప్రథమార్థంలో పెద్ద హీరోలు నటించిన చిత్రాలేవి పెద్దగా రాలేదు. అయితే.. ద్వితియార్థంలో మాత్రం వరుసగా బడా హీరోలంతా…

7 hours ago