అది రియల్ గన్ వీఎఫెక్స్ కాదు ‘యానిమల్’ ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్‌..

‘యానిమల్’ సినిమా ట్రైలర్ లో అందరూ ఓ భారీ మెషన్ గన్ ని చూసి ఉంటారు. అది వీఎఫెక్స్ తో తయారు చేసిన గన్ అని అందరూ అనుకుంటున్నారు. కానీ, అది నిజంగా తయారు చేశామని ‘యానిమల్’ మూవీ ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్‌ వెల్లడించారు. బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు మిగతా సౌత్‌ ఇండియన్ సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘యానిమల్‌’. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రన్‌బీర్ కపూర్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మేకర్స్ నాన్ స్టాప్ గా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘యానిమల్’ చిత్రానికి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ ట్రైలర్ లో మీరు చూసినది రియల్ మెషన్ గన్ అని, దాన్ని తయారు చేయడానికి 500 కేజీల స్టీల్ ని ఉపయోగించామని చెప్పారు. చాలామంది విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా తయారు చేసిందని భావిస్తున్నారు. అది నిజం కాదు, దీనిని ధర్మాకోల్, చెక్కలతో కూడా చేయవచ్చు. కానీ, ఆ గన్ కి సహజత్వం ఉండదు. అందుకే రియలిస్టిక్ గన్ తయారు చేశామని, దీనితో సీన్స్ తీస్తున్నప్పుడు దర్శకుడు, హీరో ఎంతో ఎగ్జైట్ అయ్యారని చెప్పారు. ఇలా ‘యానిమల్’ సినిమాకి సంబంధించిన ఒక్కో షాకింగ్ విషయం చెప్తూ అంచలంచలుగా అంచనాలు పెంచేస్తున్నారు

Related Posts