రెండు కొప్పులు ఒకే గూటిలో ఇమడవు అనే సామెత తెలుగులో ఉంది. అంటే ఇద్దరు ఆడవాళ్లు ఒకే చూరుకింద ఉంటే ఆ ఇద్దరికీ అస్సలు పొసగదు అని అర్థం. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ సామెత బాగా వినిపిస్తోంది. అది కూడా త్రివిక్రమ్ సినిమాకు కావడంతో ఇంకా మాట్లాడుకుంటున్నారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతోన్న గుంటూరు కారం సినిమా నుంచి పూజాహెగ్డే వెళ్లిపోయింది.
మరి తను తనకు తానుగా వెళ్లిందా లేక వీళ్లే తీసేశారా అనేది హాట్ టాపిక్ గా మారింది. నిజానికి పూజాహెగ్డేకు ఇప్పుడు ఆఫర్స్ లేవు. తెలుగులో ఈ ఒక్క సినిమా మాత్రమే ఉంది. అది కూడా పోవడంతో పూర్తిగా ఖాళీ అయిపోయింది. మరి ఎందుకు పూజా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.
ఒక రకంగా చెబితే శ్రీ లీల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నా.. పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే తను సెకండ్ హీరోయిన్. పైగా చేతినిండా సినిమాలతో డేట్స్ అడ్జెస్ట్ చేయలేనంత బిజీగా ఉంది. మరి పూజా ఎందుకు వెళ్లింది..? అనే ప్రశ్నకు సమాధానం ఒక్కటే కనిపిస్తోంది. శ్రీ లీల. యస్ కొన్నాళ్లుగా వినిపిస్తోన్న వార్తే ఇది. పూజాహెగ్డే కొన్నాళ్లుగా త్రివిక్రమ్ సినిమాల్లో కంటిన్యూస్ గా నటిస్తోంది. మామూలుగా గురూజీ తనకు వాళ్ల పర్ఫార్మెన్స్ నచ్చితే రిపీట్ చేస్తుంటాడు.
ఇంతకుముందు కూడా సమంతను ఇలాగే రిపీట్ చేశాడు. ఇప్పుడు పూజాహెగ్డే. పైగా తనకు తెలుగు కూడా నేర్పించాడు. అలాంటి తను శ్రీ లీల ఎంట్రీ తర్వాత కాస్త ఎక్కువ ఇబ్బంది పడింది అనే మాటలు వినిపించాయి. శ్రీ లీలకు ఉన్న క్రేజ్ చూసి ప్రస్తుతం టాలీవుడ్ లో హయ్యొస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ గా ఉన్న పూజా కూడా ఫీలైపోయిందట.
దీనికి తోడు తన బర్త్ డే రోజు వచ్చిన పోస్టర్స్ చూసి అమ్మడికి మతిపోయిందంటున్నారు. దీనికి తోడు శ్రీ లీల ఈ ప్రాజెక్ట్ లోకి రావడానికి ముందే తనను సెకండ్ హీరోయిన్ అనొద్దనీ.. పూజాహెగ్డేకు సమానమైన ప్రాధాన్యత కావాలని డిమాండ్ చేసింది. ఆ మేరకు ప్రొడక్షన్ హౌస్ అంగీకరించింది. దర్శకుడు కథలో మార్పులు చేశాడు. అంటే ఆటోమేటిక్ గా పూజా పాత్ర తగ్గి శ్రీ లీలకు సమానంగా వచ్చేసింది. అప్పటి నుంచే తను కాస్త కోపం ఉందనే టాక్ ఉంది.
ఏదేమైనా ప్రస్తుతం పూజాహెగ్డే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. తప్పుకుందా లేదా అనేది తర్వాత కానీ.. వేరే ఇంకేవైనా “ఇంతకంటే” ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఒప్పుకుందా అంటే ఓ ఫీమేల్ సెంట్రిక్ సినిమాకు సైన్ చేసింది అనే వార్తలు వస్తున్నాయి. పైగా ఆ చిత్రంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడట. మరి ఇది నిజమా కాదా అనేది తర్వాత.. కానీ గుంటూరు కారంలో ఈ డస్కీ బ్యూటీ లేదు. అది ఫైనల్.
If you take out the list of directors from Tollywood who have shown their ability…
The buzz of 'Kalki' has started all over the world. This movie will hit the…
Director Rajamouli made the whole world look at the Telugu film industry with the movie…
'Matka' is a period drama starring Mega Prince Varun Tej. This movie, which is being…
Some people wait for years to find success in the Telugu film industry. The young…
టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటిన దర్శకులు లిస్ట్ ను బయటకు తీస్తే.. ముందుగా వినిపించే…