ప్రభాస్ చేతుల మీదుగా ‘హరోం హరా’ టీజర్..

యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘హరోం హరా’. ఈ మూవీ టీజర్ ని 27వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఈ టీజర్ ని పాన్ ఇండియన్ ప్రభాస్ లాంచ్ చేయబోతుండటం విశేషం. జ్ఞ్యాన సాగర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీ సుబ్రహ్మణ్య సినిమాస్ సంస్థలో నిర్మిస్తున్నారు.

డిఫరెంట్ కథా చిత్రాలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో పాపులారిటీ సంపాధించుకున్న సుధీర్ బాబు నుంచి రాబోతున్న ‘హరోం హరా’ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. కాగా, ఈ నవంబర్ 27 న మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకి ఈ మూవీ టీజర్ ని ప్రభాస్ చేయనున్నట్టుగా మేకర్స్ అప్‌డేట్ వదిలారు. ఈ మేరకు ఓ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.

Related Posts