హ్యాపీ బర్త్ డే అనిల్ రావిపూడి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా వరుస విజయాలను అందుకున్నారు అనిల్ రావిపూడి. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా, చిలుకూరువారి పాలెం. చదువు మహబూబ్ నగర్, అద్దంకిలో సాగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ గుంటూరులో, వడ్లమూడి లోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చదివారు.

ఇంజనీరింగ్ పూర్తయ్యాక సినిమా ఇండస్ట్రీ అంటే ఆసక్తి ఉండటంతో కుటుంబ సభ్యుల అనుమతితో సినీరంగంవైపు వచ్చారు. అనిల్ కి దర్శకుడు అరుణ్ ప్రసాద్ బాబాయి అవుతారు. పవన్ కల్యాణ్ నటించిన తమ్ముడు చిత్రానికి దర్శకుడు. ఆయన దగ్గరే దర్శకత్వ విభాగంలో చేరారు. 2005 లో విడుదలైన గౌతమ్ ఎస్.ఎస్.సి. చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు.

శౌర్యం, శంఖం, కందిరీగ, దరువు, సుడిగాడు, మసాలా, ఆగడు, పండగ చేస్కో, గాలి సంపత్ చిత్రాలకి గాను అనిల్ రావిపూడి కథ, సంభాషణ, స్క్రీన్ ప్లే రచయితగా చేశారు. దర్శకుడిగా అనిల్ రావిపూడి మొదటి సినిమా పటాస్. పటాస్ 2015 జనవరి 23న విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ని సాధించింది. ఈ సినిమా తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3 ఇటీవల నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల ప్రధాన తారాగణంగా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధించిన భగవంత్ కేసరి చిత్రాలకి దర్శకత్వం వహించారు.

తెలుగులో అగ్ర దర్శకుడు రాజమౌళి తర్వాత మళ్ళీ వరుస విజయాలను అందుకుంటున్న దర్శకుడిగా అనిల్ రావిపూడి పేరునే చెప్పుకుంటున్నారు. అంతేకాదు, సీనియర్ దర్శకులు జంధ్యాల గారి సినిమాలు అనిల్ రావిపూడికి ఇన్స్‌పిరేషన్ అని ఆయన సినిమాలలో కామెడీ చూసి నా సినిమాలలో మంచి కామెడీ సీన్స్ రాస్తున్నానని చెబుతుంటారు. అలాగే, ఈవీవీ సత్యనారాయణ సినిమాలు కూడా ఆయనని ఇన్స్పైర్ చేశాయని అన్న సందర్భాలున్నాయి.

Related Posts