Featured

నాలుగు దశాబ్దాల నటజీవితం.. అలీ సొంతం..

నటుడు కావాలని చిన్నప్పుడే మద్రాస్ రైలెక్కాడు అలీ. వెంటనే అవకాశాలు రాలేదు. ఒకటీ రెండు సినిమాల్లో కనిపించాడు. కానీ గుర్తింపు రాలేదు. అప్పుడు భారతీరాజా తీస్తోన్న ‘సీతాకోక చిలుక‘ ఆడిషన్ కు వెళ్లాడు. ఇది అలీ జీవితాన్నే మార్చివేసింది. ఆడిషన్ లో భారతీరాజాను బాగా మెప్పించాడు. అందులో పాత్ర కొట్టేశాడు. ‘సీతాకోక చిలుక‘లో అలీకీ చాలా పేరొచ్చింది. దీంతో బాలనటుడిగా చాలా అవకాశాలే వచ్చాయి.

బాల నటుడిగా అలీ బాగానే చేసినా బాల్యం నుంచి కౌమారానికి వచ్చే టైమ్ లో చాలా ఇబ్బంది పడ్డాడు. అడపా దడపా కనిపించినా పెద్దగా గుర్తింపు రాలేదు. కొన్నేళ్ల తర్వాత యవ్వన ఛాయలు కనిపిస్తోన్న టైమ్ లోనే అతను చేసిన చాట క్యారెక్టర్ అలీకి తిరుగులేని గుర్తింపును తెచ్చింది. హాస్య నటుడిగా అలీకున్న ప్రధాన బలం.. టైమింగ్.. ఎక్స్ ప్రెషన్స్.. వీటితో పాటు డైలాగ్ డెలివరీ. ఎందరో కమెడియన్స్ ఉన్న తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు రావడానికి ఇవే కారణం. పైగా చిన్నతనం నుంచి స్టేజ్ ఫియర్ లేదు. అందువల్ల ఎంత పెద్ద యాక్టర్, డైరెక్టర్ అయినా బెరుకు లేకుండా దూసుకుపోయాడు. ముఖ్యంగా ఇవివి సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాల్లో అలీ వేసిన పాత్రలు అంత ఈజీగా మర్చిపోలేం.

అలీ జీవితంలో అద్భుతమైన క్షణం.. ఎస్వీ కృష్ణారెడ్డి నుంచి వచ్చిన ఫోన్ కాల్. అతన్ని హీరోగా పెట్టి సినిమా చేస్తున్నట్టు ఎస్వీ చెప్పగానే ముందు నమ్మలేదు.. తర్వాత పదివేలు అడ్వాన్స్ చేతిలో పెట్టాక నమ్మక తప్పలేదు. కానీ కమెడియన్ హీరో అంటే ఎక్కడో అనుమానాలున్నా.. వాటన్నిటినీ తుడిచివేస్తూ.. అలీ హీరోగా నటించిన తొలి సినిమా ‘యమలీల‘ బాక్సాఫీస్ ను టాప్ హీరోల రేంజ్ లో షేక్ చేసింది. ‘యమలీల‘ తర్వాత అలీ చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ హీరోగానే సెటిల్ కావాలనుకోలేదు. అందుకే కమెడియన్ గానూ చేశాడు. అలా అటు హీరో, ఇటు కమెడియన్ అంటూ రెండు పాత్రలపై కాలు వేసిన అలీ ఆ రెండిటినీ పూర్తిగా బ్యాలన్స్ చేయలేకపోయాడు. మరోవైపు హీరోగా చేసిన సినిమాల్లో చాలా వరకూ కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. దీంతో కమెడియన్ పాత్రలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు.

అలీ అప్పుడప్పుడూ సంఖ్యా పరంగా వెనకబడ్డా ఎప్పుడూ ఖాళీగా మాత్రం లేడు. టాప్ కమెడియన్ గా తన స్థానానికి ఎప్పుడూ రిపేర్ రాలేదు. వచ్చినా చాలా తాత్కాలికమే అయింది. అవకాశం వచ్చినప్పుడు చాలా సినిమాలను తనదైన హాస్యంతో నిలబెట్టిన సందర్భాలూ ఉన్నాయి. హీరో ఎవరైనా అలీ కామెడీ అంటే అదో స్పెషల్ అనే ముద్ర ఎప్పుడో పడిపోయింది.

సినిమాలతో పాటు, కొన్ని టివి కార్యక్రమాలకూ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. టాలీవుడ్ లో సీనియర్ మోస్ట్, కమెడియన్ గా తిరుగులేని ఇమేజ్ అలీ సొంతం. ప్రస్తుతం ‘ గీతాంజలి–2‘, అల్లు శిరీష్‌ హీరోగా నటిస్తోన్న ‘ బడ్డీ’, ‘ మిస్‌ కాళికా దేవి మిస్సింగ్‌’లతో పాటు ఇంకా పేరు పెట్టని కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు అలీ. అక్టోబర్ 10న, అలీ పుట్టినరోజు.

Telugu 70mm

Recent Posts

‘కన్నప్ప’ సినిమాలోని కీలక పాత్రలో కాజల్

మంచు విష్ణు ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లో తారల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ ఈ ప్రాజెక్ట్ లోకి వరుసగా అగ్ర…

19 mins ago

Mirnalini Ravi

26 mins ago

Ketika Sharma

40 mins ago

Janhvi Kapoor

49 mins ago

NehaSolanki

53 mins ago