కాజోల్ ని కంగారుపెట్టిన డీప్ ఫేక్ వీడియో

సినీ నటులను టార్గెట్ చేస్తూ టెక్నాలజీని ఉపయోగించి వాళ్ల వీడియోలను మార్ఫింగ్ చేయడం సోషల్ మీడియాలో ఎక్కువైంది. చాలామంది సెలబ్రిటీలకు సంబంధించి డీప్ ఫేక్ వీడియోస్ సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా నేషనల్ క్రష్ రష్మికకు సంబంధించిన ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ టు బాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా రష్మిక ఫేక్ వీడియోపై గళమెత్తారు. ఆ తర్వాత కత్రిన కైఫ్ కూడా ఇలాంటి ఫేక్ వీడియోస్ ను ఫేస్ చేసింది. లేటెస్ట్ గా బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కాజోల్ కి సంబంధించిన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

బట్టలు మార్చుకునే డీప్‌ ఫేక్ వీడియోకు కాజోల్ బాధితురాలిగా మారింది. కాజోల్ వీడియోగా సర్క్యులేట్ అవుతున్న ఈ వీడియో ఫేక్ గా తేలింది.
‘గెట్ రెడీ విత్ మీ’ ట్రెండ్‌ లో భాగంగా టిక్‌ టాక్‌ స్టార్ రోసీబీరీన్స్ ఈ వీడియోని జూన్ 5న అప్లోడ్ చేసింది. అయితే.. ఇండియాలో టిక్ టాక్ ని నిషేదించడంతో.. వి.పి.ఎన్. టెక్నాలజీ సాయంతో ఆమె టిక్ టాక్ ఖాతాను గుర్తించారు. ఆ వీడియోను ఇప్పుడు ఫేస్ మార్చి కాజోల్ న్యూడ్ వీడియో పేరుతో సర్క్యులేట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోను ఎవరు మార్ఫింగ్ చేశారనే విషయం తెలియాల్సి ఉంది.

మరోవైపు 90లలో తన గ్లామర్ తో కుర్రకారును ఓ ఊపు ఊపేసిన కాజోల్.. అజయ్ దేవగణ్ తో వివాహం తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లవడంతో మళ్లీ సినిమాలు, సిరీస్ లపై దృష్టిపెట్టింది. ఈ ఏడాది కాజోల్ నటించిన ‘లస్ట్ స్టోరీస్ 2‘ డైరెక్ట్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజయ్యింది. కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన మరో సిరీస్ ‘ది ట్రయల్‘ జూలై 14 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సందడి చేస్తుంది.

Related Posts