Featured

ఈ ఏడాది ద్వితియార్థంలో రాబోయే క్రేజీ ప్రాజెక్ట్స్

ఈ ఏడాది ప్రథమార్థంలో ‘గుంటూరు కారం’ తప్ప.. పెద్దగా అగ్ర కథానాయకులు నటించిన సినిమాలేవీ సందడి చేయలేదు. సీనియర్ హీరోలు నాగార్జున, వెంకటేష్ నటించిన ‘నా సామిరంగ, సైంధవ్’ సంక్రాంతి బరిలో వచ్చాయి. వీటిలో ‘నా సామిరంగ’ కాస్త ఫర్వాలేదనిపించింది. అయితే.. ద్వితియార్థంలో మాత్రం స్టార్ హీరోల సినిమాల జాతర ఉండబోతుంది. వరుసగా అగ్ర కథానాయకులు నటిస్తున్న పాన్ ఇండియా మూవీస్ థియేటర్లకు క్యూ కడుతున్నాయి.

వీటిలో ముందుగా వచ్చేది రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.’. జూన్ 27న వరల్డ్ వైడ్ గా ‘కల్కి’ ప్రభంజనం మొదలవ్వబోతుంది. ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటివరకూ కనీవినీ ఎరుగని కథాంశంతో ఈ సినిమాని సరికొత్తగా తీర్చిదిద్దాడట డైరెక్టర్ నాగ్ అశ్విన్. అస్సలు ఊహకందని రీతిలో టాలీవుడ్ నుంచి ప్రభాస్.. కోలీవుడ్ నుంచి కమల్.. బాలీవుడ్ నుంచి అమితాబ్ వంటి భారీ తారాగణాన్ని ఈ సినిమాలో భాగస్వామ్యం చేశాడు నాగ్ అశ్విన్. ఇంకా.. ఈ సినిమాలో దీపిక పదుకొనె, దిశా పటాని హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్ఠాత్మక వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పేరుకు తమిళ చిత్రమే అయినా.. తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదలయ్యే సినిమా ‘భారతీయుడు 2’. 1996లో అఖండ విజయాన్ని సాధించిన ‘భారతీయుడు’కి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో కరప్షన్ పై కదం తొక్కే సేనాపతిగా మరోసారి వెండితెరపై సందడి చేయబోతున్నాడు విశ్వనటుడు కమల్ హాసన్. శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘భారతీయుడు 2’ జూలై 12న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది.

ఆగస్టులో ఆడియన్స్ ను అలరించడానికి రాబోతుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’. ‘పుష్ప 1.. ది రైజ్’ భారీ విజయాన్ని సాధించడంతో ‘పుష్ప 2.. ది రూల్’పై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇక.. ఈ సినిమాలో హైలైట్ సీక్వెన్సెస్ గురించి చెప్పుకుంటే జాతర ఎపిసోడ్ సమ్‌థింగ్ స్పెషల్ గా నిలవనుందట. దాదాపు 15 నిమిషాల పాటు సాగే ఆ సీక్వెన్స్ లో వచ్చే ఫైట్స్, సాంగ్ ఇలా.. మొత్తం ఎపిసోడ్ ప్రేక్షకుల్ని సీట్ ఎడ్జ్ న కూర్చోబెట్టేలా తీర్చిదిద్దాడట డైరెక్టర్ క్రియేటివ్ జీనియస్ సుకుమార్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ‘పుష్ప 2’ని నిర్మిస్తున్నాయి.

ఆగస్టులోనే నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం తెలుగులో మంచి సక్సెస్ రేట్ తో సాగిపోతున్న స్టార్స్ లో నాని ఒకడు. ఇప్పటికే నానితో ‘అంటే.. సుందరానికి’ వంటి చిత్రాన్నందించిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

సెప్టెంబర్ విషయానికొస్తే.. తమిళ దళపతి విజయ్ నటించిన ‘గోట్’ సెప్టెంబర్ 5న విడుదల తేదీ ఖరారు చేసుకుంది. వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ మూవీ తెలుగులోనూ సందడి చేయబోతుంది. ఇక.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ మూవీ ‘ఓజీ’ కూడా సెప్టెంబర్ లోనే సందడి చేయబోతుంది. గతంలో పవన్ కళ్యాణ్ కి బ్లాక్‌బస్టర్ అందించిన ‘అత్తారింటికి దారేది’ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 27న ‘ఓజీ’ విడుదల తేదీ ఖరారు చేసుకుంది.

పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాకుండా.. యావత్ చిత్ర పరిశ్రమలోనే యాక్షన్ సీక్వెన్సెస్ పరంగా ‘ఓజీ’ ఓ సరికొత్త స్టాండార్డ్స్ సెట్ చేస్తుందనే టాక్ అయితే ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. ‘సాహో’ వంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ తీసిన సుజీత్ ‘ఓజీ’ మూవీని అంతకు మించి అన్న రీతిలో డిజైన్ చేశాడట. ఈ సినిమాలో వచ్చే కమ్ బ్యాక్ ఆఫ్ ఓజాస్ గంభీర సీక్వెన్స్, ఇంటర్వెల్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది.

అక్టోబర్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర’ భారీ స్థాయిలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ కి ‘జనతాగ్యారేజ్’ వంటి బడా హిట్ అందించిన కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా రాబోతున్న ‘దేవర’ సిరీస్ లో ఫస్ట్ పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న ఆడియన్స్ ముందుకు వస్తోంది. ఆద్యంతం సముద్రం బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ కొరటాల శివ.

‘దేవర’ సినిమాలో అండర్ వాటర్ లో వచ్చే సీక్వెన్సెస్ అయితే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయట. హై ఎండ్ టెక్నాలజీతో హాలీవుడ్ స్టాండార్డ్స్ లో ఈ అండర్ వాటర్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించాడట డైరెక్టర్ కొరటాల శివ. అంతే కాదు.. ఈ సినిమాలో వచ్చే ఓ ఆయుధ పూజ సీక్వెన్స్.. అందులో వచ్చే సాంగ్, ఫైట్ కూడా సమ్ థింగ్ స్పెషల్ గా ఉండబోతున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. లేటెస్ట్ గా రిలీజైన ‘దేవర’ ఫస్ట్ సింగిల్ ‘ఫియర్’ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ ఏడాది రాబోతున్న చిత్రాలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ఒకటి. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తీర్చిదిద్దుతున్న మేగ్నమ్ ఓపస్ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంతో కనువిందు చేయబోతున్నాడు. ముఖ్యంగా.. చరణ్ పోషిస్తున్న రెండు క్యారెక్టర్లను ఎంతో వైవిధ్యంగా తీర్చిదిద్దాడట శంకర్. ఇక.. భారీతనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే శంకర్.. ‘గేమ్ ఛేంజర్’లోని ప్రతీ సీక్వెన్స్ ను అత్యద్భుతంగా ఆవిష్కరిస్తున్నాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఆమధ్య ఈ సినిమా నుంచి విడుదలైన ‘జరగండి’ ఒక్క పాట కోసం కోట్ల రూపాయలను ఖర్చుపెట్టించాడు శంకర్.

ఇంకా.. నటసింహం బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్.బి.కె. 109’ కూడా ఈ సంవత్సరమే విడుదలకు ముస్తాబవుతోంది. ఎన్నికల తర్వాత మళ్లీ ఈ సినిమాకోసం రంగంలోకి దిగాడట బాలయ్య. ప్రస్తుతం శరవేగంగా పూర్తవుతోన్న ‘ఎన్.బి.కె. 109’ని దసరా బరిలోనే దింపడానికి సన్నాహాలు చేస్తుందట టీమ్. ‘వాల్తేరు వీరయ్య’ వంటి విజయం తర్వాత బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఇది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నుంచి వస్తోన్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇది.

Telugu70mm

Recent Posts

Ravi Teja Is Getting Ready To Compete With Puri

Mass maharaja Ravi Teja and dashing director Puri Jagannath have a good unbreakable relationship. Puri…

7 hours ago

Bharateeyudu 2 is Coming With A Huge Length.

In the past, most of the films were two and a half hours long. However..…

7 hours ago

Raj Tarun’s Girlfriend Filed A Police Complaint Against Him.

Young hero Raj Tarun is involved in controversy. Lavanya, a young woman, has lodged a…

7 hours ago

Kalyan Ram’s ‘Bimbisara’ Prequel Announcement

Creating wonders with debut directors is not a common thing. This has been proved many…

9 hours ago

పూరి తో పోటీకి రెడీ అవుతోన్న రవితేజ

మాస్ మహారాజ రవితేజ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంది. అసలు రవితేజను స్టార్…

11 hours ago

‘అహం – రీబూట్’ రివ్యూ

నటుడు: సుమంత్సినిమాటోగ్రఫి: వరుణ్ అంకర్లసంగీతం: శ్రీరామ్ మడూరీఎడిటింగ్‌: మురళీ కృష్ణ మన్యంనిర్మాత: రఘువీర్ గోరిపర్తిదర్శకత్వం: ప్రశాంత్ సాగర్ అట్లూరివిడుదల తేది:…

11 hours ago