స్టోరీ టెల్లింగ్ లో గురువు శంకర్ కి దీటైన శిష్యుడుగా దూసుకెళ్తున్నాడు యంగ్ డైరెక్టర్ అట్లీ. ‘రాజా రాణి‘ నుంచి మొదలుకొని ‘జవాన్‘ వరకూ ఒక్కో సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే షారుక్ ఖాన్ హీరోగా అట్లీ తీసిన ‘జవాన్‘ వరల్డ్ వైడ్ గా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఈ సినిమాలో షారుక్ ని ద్విపాత్రాభినయంలో చూపించిన విధానానికి.. ముఖ్యంగా కనీవినీ ఎరుగని యాక్షన్ సీక్వెన్సెస్ లో షారుక్ ని ఈ యంగ్ డైరెక్టర్ ప్రెజెంట్ చేసిన విధానానికి కింగ్ ఖాన్ ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు.
తన సినిమాల్లో ఎక్కువగా డ్యూయల్, ట్రిపుల్ రోల్స్ చూపించే అట్లీ.. ఈ సారి ఓ క్రేజీ మల్టీస్టారర్ కి శ్రీకారం చుడుతున్నాడట. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్, కోలీవుడ్ దళపతి విజయ్ కాంబోలో ఓ మల్టీస్టారర్ కి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. అది కూడా ఓ హాలీవుడ్ స్క్రిప్ట్ రైటర్ తో కలిసి. మేకింగ్ స్టాండార్డ్స్ లో హాలీవుడ్ ని మ్యాచ్ చేస్తున్న అట్లీ.. తానో హాలీవుడ్ రైటర్ తో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్టు ఇటీవల ఓ ఇంటర్యూలో తెలియజేశాడు. త్వరలోనే ఆ కథను షారుక్, విజయ్ లకు వినిపించనున్నాడట. ఇక.. ఇప్పటికే విజయ్, షారుక్ లకు మెమరబుల్ హిట్స్ అందించాడు కాబట్టి వాళ్లిద్దరి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. మొత్తంమీద.. షారుక్, విజయ్, అట్లీ, హాలీవుడ్ కలిస్తే.. ఓ బిగ్గెస్ట్ మాస్ బ్లాక్ బస్టర్ లోడ్ అయినట్టే.
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…
'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…
Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…