అందాల తార అనుష్క, విలక్షణ దర్శకుడు క్రిష్ కలయికలో ఓ సినిమా రూపొందబోతుందనే ప్రచారం జోరుగా సాగింది. తాజాగా ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. ముంబైలో జరిగిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఈవెంట్ లో అనుష్క-క్రిష్ మూవీని అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘ఘాటి’ అనే టైటిల్ ఖరారు చేశారు.
యు.వి.క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీకృష్ణా రెడ్డి, రాజీవ్ రెడ్డి నిర్మాతలు. హీరోయిన్ ఓరియెంటెడ్ గా సాగే ఈ మూవీలో డీగ్లామరస్ రోల్ లో కనువిందు చేయబోతుంది స్వీటీ. నేరస్తురాలిగా మారిన ఓ బాధితురాలి కథతో ఈ చిత్రం తెరకెక్కుతోందట. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత తెలుగులో అనుష్క నటిస్తున్న చిత్రమిది. మరోవైపు మలయాళంలో ‘కథనార్’ అనే సినిమాలో నటిస్తుంది అనుష్క. ఇటీవలే ‘కథనార్’ షూట్ లో పాల్గొంది స్వీటీ