అమెజాన్ ప్రైమ్ నుంచి రాబోయే క్రేజీ మూవీస్

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో తమ ఓటీటీ నెట్ వర్క్ నుంచి రాబోయే సినిమాలను ప్రకటించింది. వీటిలో తెలుగు నుంచి పలు క్రేజీ మూవీస్ ఉన్నాయి. ముంబై వేదికగా జరిగిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఈవెంట్ లో ఈ సినిమాలను అనౌన్స్ చేశారు. వీటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న రెండు సినిమాలున్నాయి.

పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో ‘హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలున్నాయి. ఈ రెండు సినిమాలూ థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానున్నాయి. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న హిస్టారికల్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే చాలాభాగం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. బ్యాలెన్స్ షూటింగ్ ను ఎన్నికల తర్వాత జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్-హరీష్ కాంబోలో రాబోతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి రిలీజైన స్పెషల్ గ్లింప్స్ లో పవర్ స్టార్ డైలాగ్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ కి జోడీగా శ్రీలీల నటిస్తుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో లిస్ట్ లో మెగాపవర్ స్టార్ ‘గేమ్ ఛేంజర్’ కూడా ఉంది. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇటీవలే వైజాగ్ లో ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికే దాదాపు టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని ఈ ఏడాది ద్వితియార్థంలో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ‘గేమ్ ఛేంజర్’ థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’, యూత్ స్టార్ నితిన్ ‘తమ్ముడు’ చిత్రాలు కూడా థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ రెండు చిత్రాలకూ దిల్ రాజే నిర్మాత. తెలుగు నుంచి అమెజాన్ లిస్టులో అనుష్క ‘ఘాటి’, శ్రీవిష్ణు ‘ఓం భీమ్ బుష్’ వంటి సినిమాలున్నాయి.

పరభాషల నుంచి రాబోతున్న క్రేజీ మూవీస్ లో ‘కంగువ’ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో విష్ లిస్ట్ లో ఉంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ‘కంగువ’ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇంకా.. రిషబ్‌శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాంతార: చాప్టర్‌-1’ వంటి క్రేజీ పాన్ ఇండియా మూవీస్ అమెజాన్ లిస్ట్ లో ఉన్నాయి

Related Posts