Featured

ఎన్టీఆర్ తో రాజమౌళి మరో సినిమా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైనప్ స్ట్రాంగ్ గా ఉందిప్పుడు. ఆర్ఆర్ఆర్ తో వచ్చిన గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను కంటిన్యూ చేసేలా కథలు కూడా స్పష్టంగా ఎంచుకుంటున్నాడు. ఇండియాలోని స్ట్రాంగ్ పొటెన్సియల్ ఉన్న యాక్టర్స్ లో ఎన్టీఆర్ ఒకడు అనేది ఒప్పుకుని తీరాలి.

పైగా గ్రేట్ డ్యాన్సర్ కూడా. యాక్టింగ్ పరంగా ఎన్టీఆర్ చేయలేని పాత్ర లేదు అనే చెప్పాలి. అలాంటి స్టార్ తో పనిచేయాలని ఏ దర్శకుడు మాత్రం అనుకోడు. అయితే రాజమౌళి వేరు. ఎన్టీఆర్ తో పాటుగా స్టార్డమ్ తెచ్చుకున్న దర్శకుడు. ఈ ఇద్దరి బాండింగ్ వేరే. అందుకే ఎన్టీఆర్ ఎప్పుడైనా డౌన్ అయితే చాలు.. వెంటనే అతనితో సినిమాలు చేస్తాడు రాజమౌళి.

బట్ ఇప్పుడు జూనియర్ డౌన్ ఫాల్ అనే మాటేలేదు. గ్లోబల్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే దేవర అనే సినిమా చేస్తున్నాడు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై రోజు రోజుకూ ఓ స్పైసీ న్యూస్ పెరిగిపోతున్నాయి. జాన్వీ కపూర్ ఈ మూవీతో సౌత్‌ ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది.


దేవర తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంటర్అవుతున్నాడు హృతిక్ రోషన్ తో కలిసి వార్2 మూవీ చేయబోతున్నాడు. చాలామంది వీరి మధ్య యాక్షన్ సీన్ కంటే ఓ పాటలో డ్యాన్స్ సీక్వెన్స్ ఉంటే బావుంటుంది అని ఇప్పటికే అనుకుంటున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న సినిమా ఇది.

వార్2తో పాటే అయ్యాక ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని ముందు నుంచీ చెబుతున్నారు. ఈ రెండు సినిమాల లుక్స్ లో పెద్దగా తేడాలేం ఉండవట. అందుకే చిన్న చిన్న మేకప్ కవరింగ్స్ తో ఒకేసారి రెండు సినిమాలూ చేసేలా ప్లాన్ చేసుకున్నాడు. అన్నీ కుదిరితే ఈ యేడాది చివరి వరకూ దేవర పూర్తవుతుంది. అంతకు ముందే నవంబర్ నుంచి వార్2 షూటింగ్ స్టార్ట్ అవుతుందనే టాక్ ఉంది. అప్పటికి సలార్ రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రశాంత్ కూడా ఖాళీ అవుతాడు.


అయితే ఈ రెండు సినిమాల తర్వాత మరోసారి రాజమౌళి డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్ అనే వార్తలు వస్తున్నాయి. ఇదో హిస్టారికల్ ఫిక్షన్ కథ అంటున్నారు. అంటే ఆర్ఆర్ఆర్ లాగానే వాస్తవ పాత్రలను తీసుకుని దానికి తనదైన ఫిక్షన్ ను జోడించి విజయేంద్ర ప్రసాద్ ఓ కథ రాస్తున్నాడట. ఇది చరిత్రలో ఓ యోధుడికి సంబంధించిన కథ అంటున్నారు. అందులో ఎన్టీఆర్ అయితే నెక్ట్స్ లెవల్ లో ఉంటుందనే రాజమౌళి ఆయనతోనే సినిమా చేయాలనుకుంటున్నాడు.


ప్రస్తుతం జక్కన్న మహేష్‌ బాబుతో సినిమాకు సిద్ధమవుతున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ మూవీ ఈ యేడాదే ప్రారంభం అవుతుంది. రాజమౌళి సినిమా అంటే మూడు నాలుగేళ్లు పడుతుంది అనుకుంటారు కదా..? కానీ ఈ చిత్రాన్ని కేవలం యేడాది లోగానే పూర్తి చేయాలనుకుంటున్నాడట. తర్వాత ఓ ఆరు నెలల్లోనే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ టైమ్ లో ఎన్టీఆర్ రెండు సినిమాలూ పూర్తవుతాయి. ఆ తర్వాత రాజమౌళి- ఎన్టీఆర్ ల క్రేజీ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అవుతుందంటున్నారు.


ఇక ఈ కాంబోలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ చిత్రాలు ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయని అందరికీ తెలుసు కదా..?

Telugu 70mm

Recent Posts

‘కల్కి‘ గ్రాండ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఎ.డి.‘ ప్రచారంలో స్పీడు పెంచబోతుంది టీమ్. తొలిసారి ఈ సినిమాకోసం గ్రాండ్…

11 mins ago

కేన్స్ లో ‘గేమ్ ఛేంజర్, వార్ 2‘ గురించి కియారా..!

ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కేన్స్ లో సందడి చేసింది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. కేన్స్ లో జరిగిన…

41 mins ago

Once again ‘Godfather’ combination

Director Mohan Raja directed the movie 'Godfather' with Megastar Chiranjeevi. The film is a remake…

1 hour ago

Sudheer Babu’s ‘Harom Hara’ coming on June 14

Young hero Sudheer Babu's latest movie is 'Harom Hara'. Malavika Sharma acted opposite Sudheer Babu…

1 hour ago

Deepika Padukone with baby bump

We are seeing Bollywood senior beauties getting married one by one and having children. Deepika…

1 hour ago

‘Salaar 2’ in suspense with ‘NTR-Neil’ announcement

Sensational director Prashant Neel is announcing two or three more projects as a bonus after…

2 hours ago