హైదరాబాద్ లో యామినల్ ప్రీ రిలీజ్ ఈవెంట్..ఎక్కడో తెలుసా..?

ఇటు సౌత్ లో అటు నార్త్ లో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సినిమా యానిమల్. రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ యాక్షన్, లవ్ అండ్ ఎమోషనల్ మూవీకీ సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటైల్స్ వచ్చేశాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ తర్వాత యానిమల్ మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు కాబట్టి అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో క్రేజ్ బాగా ఉంది.

ఇక ఈ సినిమాను డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నవంబర్ 27న హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీ లో సాయంత్రం 5 గం. ల నుండి గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ మేరకు చిత్రబృందం ఓ వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. కాగా, తండ్రి కొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. టి సిరీస్ ఫిలిమ్స్, సినీ ఒన్ స్టూడియోస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా అనిల్ కపూర్, బాబీ డియోల్, పృథ్వీ రాజ్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు

Related Posts