‘నేను సింగిల్ కాదు’ అంటూ సర్‌ప్రైజ్ ఇచ్చిన ఇలియానా..

‘నేను సింగిల్ కాదు’.. అంటూ గోవా బ్యూటీ ఇలియానా సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకి తన జీవిత భాగస్వామి ఫొటోను షేర్ చేసి క్లారిటీ ఇచ్చింది. ఇలియానా ఇటీవలే తల్లి అయ్యింది. అప్పటి నుంచి తన బేబీ కి సంబంధించిన విషయాలను మాత్రమే తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా అభిమానులకి పంచుకుంటోంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.

వీలు దొరికినప్పుడల్లా నెటిజన్స్ తో చాట్ చేస్తోంది. ఇక మళ్ళీ అవకాశం వస్తే సినిమాల్లోకి రావాలని ప్లాన్ చేసుకుంటోంది. త్వరలోనే స్క్రీన్ పై సందడి చేస్తానంటూ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇల్లీ బేబీ ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్తూ వస్తోంది. ఇదే సమయంలో ఓ నేటిజన్ ‘మీరు సింగిల్‌ పేరెంట్‌ నా? మీ బేబీని ఎలా చూసుకుంటున్నారు? అని అడిగారు. ఈ ప్రశ్నకి ఇలియానా..‘నేను సింగిల్‌ పేరెంట్‌ కాదు’ అంటూ తన జీవితభాగస్వామి ఫోటోను షేర్‌ చేసింది. ముందు నుంచి తన పర్సనల్ లైఫ్ గురించి ఇలియానా బయటపడలేదు. మొట్టమొదటి సారిగా ఇప్పుడు తన భాగస్వామితో డేట్ నైట్ నుండి ఫొటోలను పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Posts