మంగళవారం మరీ ఇంత బోల్డ్ గానా..?

ఆర్ఎక్స్ 100తో ఎవర్ నైట్ ఫేమ్ అయిన దర్శకుడు అజయ్ భూపతి. అస్సలే మాత్రం అంచనాలు లేకుండా అంతా కొత్తవారితో రూపొందించిన ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. కేవలం 2 కోట్ల బడ్జెట్ తో చేస్తే 15కోట్ల వరకూ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఆ సినిమా ఎఫెక్ట్ తో అజయ్ కి ఏకంగా కోలీవుడ్ హీరోలు కూడా ఆఫర్స్ ఇచ్చారు. బట్ అతను మాత్రం ఓ కథను పట్టుకుని అదే చేస్తానంటూ చాలామంది హీరోల చుట్టూ తిరిగాడు.

రవితేజ, నాగ చైతన్య లాంటి హీరోలంతా రిజెక్ట్ చేసిన ఆ స్టోరీని చివరికి శర్వానంద్, సిద్ధార్థ్ లతో చేస్తే అది కాస్తా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. ఇంతకీ ఆ సినమా ఏంటో గుర్తుందా.. ? యస్ మహా సముద్రం. ఎంతో టాలెంటెడ్ అనిపించుకున్న అజయ్ భూపతి తన క్రేజ్ మొత్తాన్ని ఈ మూవీతో సముద్రం పాలు చేసుకున్నాడు. ఆ మూవీ ఇచ్చిన షాక్ నుంచి తేరుకుని ఇప్పుడు ‘మంగళవారం’అనే చిత్రంతో వస్తున్నాడు. చిత్రం ఏంటంటే.. ఈ మూవీలో మళ్లీ తన ఫస్ట్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నే రిపీట్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశాడు.


ఈ టైటిల్ చూస్తే తెలుగువారికి చాలా గుర్తొస్తాయి. మంగళవారం అనే మాటతో నాటు సామెతలు కూడా ఉంటాయి. ఆ కోణంలో సాగే కథ కాబట్టే ఈ టైటిల్ పెట్టారా లేదా అనేది చెప్పలేం కానీ ఖచ్చితంగా ఇది కూడా అతని ఫస్ట్ మూవీ ఆర్ఎక్స్ 100 లాగా పూర్తిగా బోల్డ్ కంటెంట్ తోనే వస్తోందని ఫస్ట్ లుక్ తోనే తేల్చేశాడు. ఏకంగా తన హీరోయిన్ నగ్నంగా ఉన్న ఫోటో విడుదల చేశాడు.

సింపుల్ గా దీన్ని ‘టాప్ లెస్’గా చెప్పొచ్చు. ప్రస్తుతం వినిపించేదాన్ని బట్టి ఓ మూడు దశాబ్దాల క్రితం కన్నడలో కాశీనాథ్ అనే దర్శకుడు తీసిన తరహా బి గ్రేడ్ కు తక్కువ, రెగ్యులర్ మూవీకి ఎక్కువ అనేలా ఉంటుందంటున్నారు. ఏదేమైనా మంగళవారం ఫస్ట్ లుక్కే ఇంత బోల్డ్ గా ఉంటే ఇంక సినిమా ఎంత రంజుగా ఉంటుందో చూడాలి.

Related Posts