హ్యాట్రిక్ లోనే అరుదైన రికార్డు

తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు 50 ఏళ్లుగా కెరీర్ కొనసాగిస్తున్న అరుదైన నటుడు నటసింహం బాలకృష్ణ. తన కెరీర్ లో ఇప్పటివరకూ 108 సినిమాలను విడుదల చేశాడు. ఈ సినిమాలతో.. ఎన్నో బ్లాక్ బస్టర్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమాతో అరుదైన రికార్డును నమోదు చేశాడు. వరుసగా ‘అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి’ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద వందేసి కోట్లు కొల్లగొట్టిన రేర్ ఫీట్ ఇప్పుడు బాలయ్య సొంతమయ్యింది.

‘అఖండ, వీరసింహారెడ్డి’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వందేసి కోట్లకు పైగా కొల్లగొట్టాయి. లేటెస్ట్ గా ‘భగవంత్ కేసరి’ కూడా 6 రోజుల్లోనే రూ.104 కోట్లు వసూలు చేసింది. దీంతో.. హ్యాట్రిక్స్ లోనే సమ్ థింగ్ స్పెషలైన హ్యాట్రిక్ ను కొట్టేశాడు. ఇక.. బాక్సాఫీస్ వద్ద బాలయ్యకి హ్యాట్రిక్స్ కొట్టడం కొత్తేమీ కాదు.

ముఫ్ఫై ఏళ్ల క్రితం ఒకేరోజు విడుదలైన రెండు బాలకృష్ణ చిత్రాలు ‘నిప్పురవ్వ, బంగారు బుల్లోడు’ విజయాలు సాధించాయి. ఈ సినిమాల తర్వాత వచ్చిన ‘భైరవద్వీపం’ బ్లాక్ బస్టర్ తో.. బాలకృష్ణకి హ్యాట్రిక్ హిట్స్ అందాయి. అంతకుముందు 1986లోనూ వరుసగా డబుల్ హ్యాట్రిక్స్ కొట్టాడు నటసింహం.

Related Posts