విజయ్ 68 కోసం భారీ తారాగణం

యావత్ దేశంలోనే ఇప్పుడు యమ స్పీడుగా సినిమాలు చేసే స్టార్ హీరో విజయ్. తమిళ దళపతి విజయ్ ఇటీవలే తన 67వ చిత్రమైన ‘లియో’ని రిలీజ్ చేశాడు. టాక్ తో సంబంధం లేకుండా ‘లియో’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది.

ఇక.. ఒక సినిమా పూర్తైన వెంటనే మరో చిత్రాన్ని పట్టాలెక్కించే ఈ ఇలయదళపతి.. దసరా కానుకగా తన 68వ సినిమాకి ముహూర్తాన్ని పూర్తిచేశాడు.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఎ.జి.ఎస్. ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న విజయ్ 68 కాస్టింగ్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో తారాగణం లిస్ట్ భారీనే ఉంది. విజయ్ కి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తుంది.

ఈ యంగ్ బ్యూటీకి ఇది క్రేజీ ఆఫర్ అని చెప్పొచ్చు. ఇంకా సీనియర్ బ్యూటీస్ స్నేహ, లైలా కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యారు.

మేల్ క్యారెక్టర్స్ విషయానికొస్తే సీనియర్ హీరోస్ ప్రభుదేవా, ప్రశాంత్, జయరాం వంటి వారు కీ రోల్స్ చేస్తున్నారు.

ఇంకా.. యోగిబాబు, మోహన్, అజ్మల్ అమీర్, వైభవ్, ప్రేమ్ జీ అమరన్ వంటి భారీ తారాగణమే ఉంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

మొత్తానికి మేకోవర్ విషయంలో పెద్దగా పట్టింపులు లేని విజయ్.. సినిమాల సెలక్షన్ విషయంలో డైరెక్టర్స్ ట్రాక్ రికార్డును కూడా అంతగా పట్టించుకోడు. తనకు కథ నచ్చితే ఆ సినిమా చేసుకుంటూ పోతాడు.

అదే ఒక్కోసారి ఈ కోలీవుడ్ స్టార్ కి మైనస్ గా కూడా మారుతోంది. ఏదేమైనా సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ కింగ్ గా నిలిచే విజయ్ తన 68వ సినిమాని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు.

Related Posts