‘గుంటూరు కారం‘ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం‘ అప్డేట్స్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అసలు దసరా కానుకగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ వస్తుందనుకున్నారు. అయితే.. లేటెస్ట్ గా ఫ్యాన్స్ కు సర్ప్రైజింగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది టీమ్. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది. అందుకు సంబంధించిన ప్రోమో కి టైమ్ ఫిక్సయ్యింది.

ఇటు మహేష్.. అటు త్రివిక్రమ్ ఇద్దరితోనూ వరుస సినిమాలకు సంగీతాన్నందిస్తున్న తమన్ ‘గుంటూరు కారం‘ చిత్రానికి సంగీతాన్నందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ‘దమ్ మసాలా‘ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ప్రోమో రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు విడుదలకాబోతుంది. ఈ పాట ఘాటు ఘాటు గా వేడి వేడిగా ఉండే దమ్ బిర్యానీలా ఉంటుందంటూ మహేష్ ఫ్యాన్స్ కు హింట్ ఇచ్చాడు తమన్. అయితే.. ‘దమ్ మసాలా‘ ఫుల్ సాంగ్ త్రివిక్రమ్ బర్త్ డే స్పెషల్ గా నవంబర్ 7న విడుదలకానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని రేపు ప్రోమోలోనే వెల్లడించనున్నారు.

Related Posts