సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది సమంత. తర్వాత ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్, వ్యక్తిగత జీవితంతో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్యతో విడాకులు కూడా అయిన తర్వాత మళ్లీ సినిమాలపై కాన్ సెంట్రేట్ చేసింది. వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోంది.
ప్రస్తుతం తను నటిస్తోన్న ”ఖుషీ” మూవీ చివరి పాట చిత్రీకరణ జరుపుకుంటోంది. మరోవైపు బాలీవుడ్ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. దీంతో పాటు ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కు సైన్ చేసింది. మరికొన్ని ప్రాజెక్ట్స్ కోసం ఆడిషన్స్ కూడా ఇస్తోంది. ఈ నేపథ్యంలో సమంత గురించి కొన్ని వార్తలు సౌత్ కు షాక్ ఇస్తున్నాయి.
ఒకప్పటిలా సమంత సౌత్ కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వదలచుకోవడం లేదు అనేది ఆ వార్తల సారాంశం. తన దృష్టంతా కేవలం బాలీవుడ్ ఆ తర్వాత హాలీవుడ్ పైనే ఉందంటున్నారు. అందుకే సౌత్ ను వదిలించుకునేందుకు సరికొత్త ఉపాయం కూడా ఆలోచించిందట. అదేంటంటే.. తనకు కథ చెప్పాలంటే ముందు తన రెమ్యూనరేషన్ తేల్చాలి అంటోందట. ‘దాందేముందీ.. సరే తేల్చేద్దాం’ అని ఎవరైనా నిర్మాత ఉత్సాహం చూపిస్తే ఆ వెంటనే వారి ఉత్సాహం నీరుగారిపోయే ఫిగర్ చెబుతోందట. ఎంతనుకుంటున్నారు.. ? 10 కోట్లు. ఇదీ సమంత చెబుతోన్న రెమ్యూనరేషన్. ఈ మొత్తానికి ఒప్పుకుంటేనే అసలు కథ వినేందుకైనా టైమ్ ఇస్తా అని చెబుతోందట.
ప్రస్తుతం సౌత్ తో పాటు హిందీ మొత్తం కలిపినా సమంతకు అంత మార్కెట్ సోలోగా లేదు. అందుకు రీసెంట్ గా వచ్చిన యశోద, శాకుంతలం చిత్రాలే ఉదాహరణ. అయినా ఏ ధైర్యంతో ఇంత రెమ్యూనరేషన్ చెబుతోందీ అంటే.. ముందు సౌత్ సినిమాలను వదిలించుకునేందుకే అనేది లేటెస్ట్ గా వినిపిస్తోన్న ఓ కొత్త వాదన. మరి ఇందులో నిజమెంత అనేది చెప్పలేం కానీ.. సౌత్ లో ఈ రేంజ్ కేవలం నయనతారకు మాత్రమే ఉంది.
అటు బాలీవుడ్ లో మీడయం రేంజ్ హీరోయిన్లు కూడా ఈ మొత్తం రెమ్యూనరేషన్ అందుకుంటారు. కానీ సమంత ఇప్పటి వరకూ బాలీవుడ్ లో ఒక్క బ్లాక్ బస్టర్ కూడా కొట్టలేదు. ఇంకా చెబితే అసలు హిందీ సినిమాయే చేయలేదు. కేవలం ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ కు వచ్చిన క్రేజ్ తో పాటు నాగ చైతన్యకు సంబంధించిన వ్యవహారంతో పాటు తన ఆరోగ్య సమస్యలపై వచ్చిన సింపతీ మాత్రమే ఉంది.
బట్ ఈ సింపతీస్ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కావు అని ఆల్రెడీ ప్రూవ్ అయింది. అయినా తను పది కోట్లు డిమాండ్ చేస్తుందీ అంటే ఇక తన దృష్టి కేవలం బాలీవుడ్, హాలీవుడ్ పైనే అని ఇన్ డైరెక్ట్ గా చెప్పడమే అనేది కొందరు విశ్లేషకుల అంచనా. మరోవైపు ఖుషీ మూవీ పూర్తయిన వెంటనే పూర్తిగా తన మకాంను ముంబైకి మార్చబోతోందనే టాక్ కూడా ఉండనే ఉంది. సో.. సమంత డిమాండ్ చేస్తుందా లేక సౌత్ ను వదిలించుకుంటుందా అనేది ఆడియన్స్ అంచనాలకే వదిలేయాలింక.
రెబెల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాకి చాలా లేటుగా ఎంటరయ్యాడు. పైగా ప్రభాస్ నుంచి వచ్చే అప్డేట్స్ అరుదుగా ఉంటాయి.…
జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లోని తన ఇంటి స్థలం వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని…
ఫ్రాన్స్ లోని కేన్స్ లో ప్రతి సంవత్సరం జరిగే ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో ప్రతిష్టాత్మకమైంది. ఈ ఏడాది 77వ కేన్స్…
ఎన్నికలు, IPL కారణంగా తక్కువ ఫుట్ ఫాల్ ఉండడంతో థియేటర్లకు నష్టం జరిగింది. తద్వారా ఆదాయాలపై ప్రభావం పడింది. ఈ…
Producer Dil Raju, who has entertained with family entertainers till now, is bringing a ghost…
Young hero Varun Sandesh's latest movie is 'Ninda'. This movie is going to be based…