భారత్, పాక్ యుద్ధంలో ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకూ చేయని పాత్ర చేయబోతున్నాడా..? అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడా అంటే అవుననే అంటున్నాయి శాండల్ వుడ్ వర్గాలు. ఎన్టీఆర్ సినిమా గురించి వాళ్లెందుకు చెబుతారు అనుకుంటున్నారు కదా..? వాళ్లేచెబుతారు. ఎందుకంటే ఇది ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయబోతోన్న సినిమా కాబట్టి. యస్.. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతోన్న సినిమా గురించి కన్నడ నాట ఓ హాట్ టాపిక్ నడుస్తోంది. మామూలుగా ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకూ చేసిన సినిమాలు డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో ఉన్నాయి. అవి మరీ కొత్తవి కాకపోయినా.. అతని టేకింగ్, మేకింగ్ కొత్తగా ఉంటుంది.

పైగా యాక్షన్ లవర్స్ కు ఫుల్ మీల్స్ పెడతాడు. అందుకే ఈ మూవీ గురించి ఆరాలు మొదలయ్యాయి. అలా తెలిసిన విషయం ఏంటంటే.. వీరి కాంబోలో వస్తోన్న మూవీ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా. ఇది ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. అయితే మూవీ నేపథ్యం మాత్రం ఓ యుద్ధం ఉంటుందట. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించిన కథ అంటున్నారు. అంటే యాక్షన్ తో పాటు కావాల్సినంత ఎమోషన్ ను కూడా ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. దీంతో పాటు ఈ కథలో కొన్ని వాస్తవ సంఘటనలు కూడా ఉంటాయట. ఇంకేం.. ఎన్టీఆర్ తో పాటు ప్రశాంత్ ఫ్యాన్స్ వీరి నుంచి ఏం ఎక్స్ పెక్ట్ చేస్తారో అదంతా ఉంటుందన్నమాట.


ఇక ఈ చిత్రలో ప్రియాంక చోప్రాను హీరోయిన్ గా ఒప్పించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇక ప్రశాంత్ టీమ్ ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసిందట. తను అప్పుడప్పుడూ వెళ్లి అప్డేట్ ఇస్తున్నాడు. తను మరోవైపు ప్రభాస్ సలార్ తో కూడా బిజీగా ఉన్నాడు కాబట్టి ఎక్కువగా టీమ్ తోనే వర్క్ చేయిస్తున్నాడట. సలార్ రిలీజ్ తర్వాత పూర్తి స్థాయిలో కథపై వర్క్ చేస్తాడు. దీంతో పాటు ప్రీ రిలీజ్ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. 2024 మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందట. మొత్తంగా ఈ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయడం ఎన్టీఆర్ కు కూడా ఫస్ట్ టైమ్. మరి ఇది ఏ టైప్ లో ఉంటుందో చూడాలి.

Related Posts