యశోదకే దిక్కులేదు..ఇంక రెండు, మూడు కూడానా..?

కంటెంట్ సినిమాలకే కలెక్షన్స్ అనే మాట కూడ రిపేర్ కు వస్తోందిప్పుడు. ప్రేక్షకులు వైవిధ్యమైన సినిమాలను ఇష్టపడుతున్నారు. కానీ బలమైన ప్రమోషన్స్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పెడుతున్నారు. ప్రస్తుతం తెలుగులో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. రీసెంట్ గా వచ్చిన సమంత యశోద చిత్రానికి మంచి కంటెంట్ ఉందనే రివ్యూస్ వచ్చాయి. కానీ ఆ రేంజ్ లో రెవిన్యూ రావడం లేదు. ఫస్ట్ వీకెండ్ వరకూ బాగానే పర్ఫార్మ్ చేసినా.. సోమవారం నుంచి సడెన్ గా పూర్తిగా డల్ అయిపోయింది మార్కెట్.

దీంతో కనీసం బ్రేక్ ఈవెన్ దగ్గరకు అయినా వస్తుందనుకున్న యశోద ఇప్పుడు నష్టాల వైపుగా వెళుతోంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీలోనూ విడుదల చేసినా.. అక్కడా అదే పరిస్థితి ఉండటం విశేషం. నిజానికి సమంతకు ఇమేజ్ కు ఈ బలమైన కంటెంట్ నిర్మాతను సేఫ్ చేస్తుందనే అనుకున్నారు.

కానీ వీకెండ్ లో ఉన్న సిట్యుయేషన్ వీక్ దాటే సరికి వీక్ అయిపోయింది. మరోవైపు సూపర్ స్టార్ క్రిష్ణ మరణం వల్ల జనాల ద్రుష్టి అంతా అటే వెళ్లింది. దీంతో రిలీజ్ అయిన సినిమాలను ఎవరూ పట్టించుకోలేదు కూడా.


ఇక సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా.. వారి ప్రయత్నాన్ని మాత్రం అప్రిసియేట్ చేయాల్సిందే. జనాలు కలెక్షన్స్ రూపంలో ప్రశంసించలేదు. దీంతో వాళ్లే సక్సెస్ మీట్ ఏర్పాటు చేసుకుని ఒకరిని ఒకరు పొగుడుకున్నారు. ఆ క్రమంలోనే దర్శకులతో పాటు నిర్మాత కూడా సమంత ఒప్పుకుంటే సీక్వెల్స్ తీస్తాం అని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమాకే దిక్కులేదు.

ఇంక సీక్వెల్స్ తీస్తే పట్టించుకుంటారా అనేది సగటు ప్రేక్షకుడి ప్రశ్న. నిజానికి ఈ కథలో సీక్వెల్ కు సరిపోయే స్టఫ్ ఉంది. అది ఆడియన్స్ ను మరింతగా ఆకట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ అయి ఉంటే బావుంటుంది. అలా కాకుండా పార్ట్ 2, పార్ట్ 3 కూడా తీస్తాం అని చెప్పడం హాస్యాస్పదమే అవుతుంది.

Related Posts