చిన్న సినిమాగా వచ్చి దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా కాంతార. కన్నడలో మంచి దర్శకుడు, నటుడుగా పేరు తెచ్చుకున్న రిషభ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ నటించిన ఈ ఫోక్లోర్ థ్రిల్లర్ కు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. మొదట కన్నడ చిత్రంగానే విడుదలైనా.. ఆ మూవీకి వచ్చిన రివ్యూస్ చూసిన తర్వాతే ఇతర భాషల వాళ్లు డబ్బింగ్ చేయడానికి ముందుకు వచ్చారు.

అలా అన్ని భాషల్లో డబ్ అయిన ఈ మూవీ కొన్నవాళ్లందరికీ డబుల్ డబ్బులు తెచ్చింది. ఈ మధ్య కాలంలో హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్స్ తెచ్చిన సినిమాగా కాంతారను చెప్పొచ్చు. ఇక తెలుగులో విడుదల చేసిన అల్లు అరవింద్ కు భారీ లాభాలు తెచ్చిందీ చిత్రం. రిషభ్ శెట్టి సరసన సప్తమి గౌడ నటంచిన ఈ మూవీలో అచ్యుత్, కిశోర్ ల పాత్రలూ హైలెట్ గా నిలిచాయి.

కర్ణాటకలోని మంగుళూరు ప్రాంతంలోని పశ్చిమ కనుమల నుంచి వచ్చిన పంజుర్లీ అనే దేవత కథనే కమర్షియల్ గా చెప్పాడు దర్శకుడు రిషబ్ శెట్టి. దీనికి ఇతర కాస్టింగ్ కూడా మంచి సపోర్ట్ కావడం, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ నెక్ట్స్ లెవెల్ లో కుదరడంతో బ్లాక్ బస్టర్ గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా కాంతార ఇప్పటికే 350 కోట్లకు పైగా వసూల్లు సాధించింది. అయినా ఇప్పటికీ దేశవ్యాప్తంగా అనేక థియేటర్స్ లో స్ట్రాంగ్ గా ఉన్న ఈ చిత్రం త్వరలోనే 400 కోట్ల మార్క్ ను కూడా టచ్ అవుతుందునుకుంటున్నారు.


అయితే ఎలా చూసినా ఇదో లైబ్రరీ మూవీ. అంటే ఎప్పుడు చూసినా బోర్ కొట్టని కంటెంట్ ఉన్న చిత్రం. అందుకే ఓటిటిల్లో ఎప్పుడు విడుదలవుతుందా అని ఆల్రెడీ చూసిన వాళ్లు కూడా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారి కోసం ఈ రిలీజ్ డేట్.

అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 24నుంచి కాంతార స్ట్రీమ్ కాబోతోంది. మరి ఇప్పటి వరకూ థియేటర్స్ ల సత్తా చాటిన ఈ మూవీ ఓటిటిలో కూడా అదే స్థాయిలో మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి.