వైజాగ్ పోర్టులో పుష్ప హల్ చల్

కాన్ స్టార్ అల్లు అర్జున్ వైజాగ్ లో ల్యాండయ్యాడు. ‘పుష్ప.. ది రూల్’ కోసం వైజాగ్ పోర్టులో సందడి చేయబోతున్నాడు. విశాఖ షిప్పింగ్ హార్బర్ పోర్టు ఏరియాలో రెండు రోజుల పాటు షూటింగ్ చేయనున్నారు. విశాఖ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున అభిమాన గణం బన్నీకి ఘన స్వాగతం పలికారు.

క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ ‘పుష్ప 2’. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ పుష్పరాజ్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం ను విదేశాలకు ఎగుమతి చేసే క్రమంలో సాగే సన్నివేశాలను వైజాగ్ పోర్టులో చిత్రీకరిస్తారట. ‘పుష్ప 2’ ఆగస్టు 15న విడుదల తేదీ ఖరారు చేసుకుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో షూటింగ్ లో వేగం పెంచింది టీమ్. డెడ్ లైన్ ను చేరుకోవడానికి రెండు యూనిట్లతో పనిచేస్తున్నారట.

Related Posts