వచ్చిందండీ.. వింజామర వంశ రాణి

శ్వాగణిక వంశానికి ధీటుగా.. వింజామర వంశ రాణి సవాల్ విసిరింది. మగవాడంటే పగవాడంటూ.. ప్రతీ మగవాడి మెడలు వంచుతామంటూ ప్రకటించింది. అంతలోనే శ్వాగణిక వంశ యువరాజు ఫోన్ చేసి మరీ ఆడవారికి తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తాడు. ఎందుకంటే ఇది మా కథ అంటూ శ్వాగ్ మూవీ ప్రమోషన్స్‌ను మరింత క్రియేటివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. గతంలో శ్రీ విష్ణు బర్త్‌డే సందర్భంగా రిలీజ్‌ చేసిన స్టోరీ ఆఫ్ టైటిల్‌ గ్లింప్స్‌తో లింక్ చేస్తూ.. క్వీన్‌ ఆఫ్‌ శ్వాగ్ అంటూ రీతూవర్మ బర్త్‌డే స్పెషల్‌ వీడియో రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో హసిత్ గోలి డైరెక్షన్‌ లో రాబోతున్న మూవీ ఇది. ఎంటర్‌టైన్‌మెంట్ అద్దిరిపోయే రేంజ్‌లో ఉండబోతుందని హింట్ ఇచ్చేలా ఈ చిత్ర ప్రమోషన్స్‌ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నారు.

Related Posts