ఎమ్ఎస్ రాజుకు ఏమైంది..?

సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ .. ఈ బ్యానర్ పేరు చెబితే తెలుగులో ఒకప్పుడు గౌరవప్రదమైన నిర్మాణ సంస్థగా ప్రతి ఒక్కరూ చూశారు. విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ ను చేసిందీ.. మహేష్ బాబుకు ఫస్ట్ బ్లాక్ బస్టర్ వచ్చింది.. ఉదయ్ కిరణ్ ను లవర్ బాయ్ ని చేసిందీ.. ప్రభాస్ కు ఫస్ట్ బ్లాక బస్టర్ ఇచ్చిందీ ఆ బ్యానరే. శ్రీహరిని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలబెట్టి.. కొరియోగ్రాఫర్ ప్రభుదేవను దర్శకుడిని చేసిందీ ఈ బ్యానరే. అన్నిటికీ మించి అమ్మోరు తర్వాత ఎవరూ ధైర్యం చేయకపోతే దేవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు గ్రాఫికలవ్ వండర్ ను చూపించి ఇప్పుడు రాక్ స్టార్ అని చెప్పుకుంటోన్న దేవీ శ్రీ ప్రసాద్ ను టీనేజ్ లోనే మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేసిందీ ఈ బ్యానర్ అధినేత ఎమ్మెస్ రాజు. అలాంటి నిర్మాతకు ఇప్పుడు ఏమైందీ..? అంటే సమాధానం అంత కష్టమేం కాదు. పౌర్ణమి తర్వాత అతని బ్యానర్ కు అమావాస్య పట్టుకుంది. అయినా నిలదొక్కుకోవచ్చు. కానీ అతి విశ్వాసంతో ఎమ్మెస్ రాజు ఆడిన ఒక్క ‘ఆట’ సినిమా అతని జీవితంతో ఆడేసుకుంది. యస్.. అతను ఆట అనే సినిమాతోనే ఎటూ కాకుండా పోయాడు. ఇది అతను కూడా ఒప్పుకుని తీరే సత్యం.
తన బ్యానర్ లో మనసంతా నువ్వే లాంటి క్లాసిక్ లవ్ స్టోరీ తీసిన విఎన్ ఆదిత్య డైరెక్షన్ లో అప్పటి సెన్సేషన్స్ సిద్ధార్థ్, ఇలియానా జంటగా తీసిన ఆటతో బిగ్గెస్ట్ డిజాస్టర్ చూశారు. సినిమా తెచ్చిన నష్టాలకంటే అప్పటి వరకూ ఎప్పుడూ లేని విధంగా హీరోయిన్ కు ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చాడు. ఆమెతో బిగ్రేడ్ తరహా ఎక్స్ పోజింగ్ చేయించి అటు వ్యక్తిగతంనూ విమర్శలు ఫేస్ చేశాడు. ఈ మూవీ ఇచ్చిన నష్టాల తర్వాత ఎమ్మెస్ రాజు కు మళ్లీ కోలుకుంటాడా అనుకున్నారు. .
అయితే సినిమా పరిశ్రమలో ఇలాంటి ఆటలు కామన్. ఎమ్మెస్ రాజు లాంటి కథాబలం తెలిసిన నిర్మాత బౌన్స్ బ్యాక్ కావడం కష్టమేం కాదు. పైగా ఆ టైమ్ లో ప్రభాస్, మహేష్ లాంటి హీరోలు కూడా డేట్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఈయన మాత్రం దర్శకుడుగా మారాలనుకున్నాడు. కన్నడలో హిట్ అయిన ముంగారమలై అనే సినిమాను వానగా తెలుగులో రీమేక్ చేశాడు. కన్నడలో బిగ్గెస్ట్ హిట్ అయిన ఆ మూవీ మ్యాజిక్ ను ఇక్కడ రిపీట్ చేయలేకపోయాడు. దీంతో మరో లాస్. తర్వాత మస్కా అనే మూవీతో ఓకే అనిపించుకున్నాడు. కానీ ఈ లోగా పరిశ్రమలోనూ చాలా మార్పులు వచ్చాయి. వాటి పట్టుకోకుండా అప్పటికే అవుట్ డేటెడ్ అనిపించుకున్న తూనీగ తూనీగ సినిమాతో కొడుకు హీరోగా పరిచయం చేసి ‘‘చెక్’’లు కాల్చుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత రీసెంట్ గా ఈ ట్రెండ్ కు తగ్గ కథ అంటూ మరో బి గ్రేడ్ మూవీ డర్టీ హరితో వచ్చాడు. దీన్నీ ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మరోసారి ‘‘7 డేస్ 6 నైట్స్’’ అనే సినిమాతో వస్తున్నాడు.
లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశాడు. ఈ ట్రైలర్ చూశాక ఎమ్మెస్ రాజు పై చాలామంది జాలిపడుతున్నారు. ఒకప్పుడు వైభవంగా వెలిగిన బ్యానర్ ఇంత దిగజారిపోయిందేంటా అని బాధపడుతున్నారు. పోనీ బి గ్రేడ్ అయినా ఆ మేరకు ఆకట్టుకునేలా ట్రైలర్ కట్ చేశారా అంటే.. సినిమా పరిశ్రమపై ఏ అవగాహనా లేకుండా అప్పుడే కొత్తగా వచ్చిన ఓ దర్శకుడు కట్ చేసిన ట్రైలర్ లా ఉంది. అస్సలే మాత్రం ఆకట్టుకోలేకపోయిన ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం.. అయితే అసలు ఎమ్మెస్ రాజుకు ఏమైందా అనేదే పెద్ద ప్రశ్న. అలా ఖాళీగా ఉన్నా.. ఆయన గౌరవం ఉంటుంది.. ఇలాంటి ప్రయత్నాలతో అదీ పోయేలా ఉందని ఆయన సన్నిహితులే చెప్పుకుంటున్నారు..

Related Posts