ad

నేచురల్ స్టార్ గా తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్నాడు నాని. వైవిధ్యమైన కథలంటే కంటే తన ఇమేజ్ కు తగ్గ పాత్రలతోనే ఎక్కువగా ఫేమ్ అయ్యాడు. పైగా ఈ మధ్య కాలంలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగాడనే ట్యాగ్ కూడా అన్ని వర్గాల్లో సింపతీ తెచ్చింది. దీనికి తోడు కొన్నాళ్ల క్రితం వరస విజయాలు సాధించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ లో ఓ రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఎంతలా అంటే.. ఇప్పుడు స్టార్ హీరోల ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాని సినిమాలను ఇష్టపడేంతగా.. అలాంటి నాని కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులు చూస్తున్నాడు. ఓ దశలో వరుసగా అరడజను ఫ్లాపులు వచ్చాయి. వీటిలో తను తన ఇమేజ్ ను మార్చుకునే ప్రయత్నంలో చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అంటే పాత ఇమేజ్ పనిచేయలేదు. ఇటు కొత్త ఇమేజ్ కోసం చేసిన ప్రయత్నమూ ఫలించలేదు. ఈ క్రమంలో ఆ మధ్య వచ్చిన శ్యామ్ సింగరాయ్ తో వైవిధ్యమైన పాత్రలో కనిపించాడు. మరీ సూపర్ అని కాదు కానీ అంతకు ముందు ఉన్న ఫ్లాపులను మర్చిపోయేంత విజయంగా నిలిచిందీ చిత్రం. ఇక ఈ టైమ్ లో అంటే సుందరానికి అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చాడు. టైటిల్ తో పాటు ప్రమోషన్స్ అన్నీ కలిపి సినిమాకు మంచి ఓపెనింగ్స్ తెచ్చాయి. కానీ అవి ఓపెనింగ్ రోజే డ్రాప్ కావడం విశేషం.
అంటే సుందరానికి ఈ మధ్య కాలంలో నాని నటించిన సినిమాల్లో అతి తక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా మిగిలిపోయింది. ఈ వీకెండ్ కు కొంత వరకూ లాగేయెచ్చేమో కానీ.. ఓవరాల్ గా ఈ మూవీ కమర్షియల్ గా గట్టెక్కడం కష్టమే అంటున్నారు. నిజానికి నాని మార్కెట్ కొన్నాళ్లుగా తగ్గుతూనే వస్తోంది. ఈ సినిమా విషయంలో అది మరింత స్పష్టంగా కనిపించింది కూడా. అందుకే చాలా చోట్ల అతని గత సినిమాల కంటే చాలా చోట్ల తక్కువ రేట్లకే సినిమాను అమ్మేశారు. అయినా ఆ చిన్న మొత్తాన్ని కూడా రాబట్టడం కష్టం అనేది ట్రేడ్ టాక్. ఓ రకంగా ఇది నానికి పరాభవం అనే చెప్పాలి. అటు ఓవర్శీస్ లో కూడా ఆశించినంత టికెట్స్ తెగడం లేదు. నిజానికి ఓవర్శీస్ లో నానికి బలమైన బేస్ ఉంది. ఆ బేస్ కూడా బీటలు వారుతోంది అంటే .. నాని మూవీస్ ఎంత రొటీన్ అవుతున్నాయి అనేది ఆలోచించుకోవాలి.
ఓ విషయం మాట్లాడితే.. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ టైటిల్ ను తన అభిరుచి మేరకు పెట్టాడనే అనుకోవాలి. దీంతో ఇది క్లాస్ ను తప్ప మాస్ ఆడియన్స్ ను రీచ్ కాలేదు. ఇటు సినిమా కూడా క్లాస్ పీపుల్ కే పరిమితం అనేలాంటి సీన్స్ తో నిండి ఉంది. అందుకే బిసి సెంటర్స్ లో సుందరాన్ని పట్టించుకునేవారు లేరు అంటున్నారు. మరోవైపు క్లాస్ ఆడియన్స్ ను కూడా చిరాకు పెట్టేంత నిడివి కూడా సుందరానికి మైనస్ అయింది. మొత్తంగా సుందరం గట్టెక్కాలంటే ఏదైనా మ్యాజిక్ జరగాల్సిందే అంటున్నారు సినీ జనం.

, , , , , , ,