ad

మొన్న రావణ్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. ఇండియా లోని బెస్ట్ యాక్టర్స్ లో ఒకడుఁ అనేది కాదనలేని నిజం. పాత్ర ఏదైనా ఘట్టం ఏదైనా అతనికి కొట్టిన పిండే. రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ తో మరోసారి తనో బెస్ట్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. అతని నటనకి దేశం అంట ఫిదా అయిపోయింది అంటే అతిశయోక్తి కాదు. కానీ ప్లానింగ్ విషయంలో మాత్రం ఎన్టీఆర్ ఇంకా బెటర్ అవ్వాలి అనేది ఆయన అభిమానులు కూడా చెప్పుకునే మాట. అది ఎలా ఉన్నా.. గతం లో జై లవకుశ చిత్రంలో రావణ్ పాత్రలో అద్భుతమైన విలనీ పండించి ఔరా అనిపించాడు. నిజానికి రావణుడు పాత్రను పౌరాణికాల్లో పెద్ద ఎన్టీఆర్ గొప్పగా పోషించాడు. ఆ పాత్రను సాంఘికాల్లోనూ పండించవచ్చు అని ఈ ఎన్టీఆర్ నిరూపించాడు. రావణ్ క్యారెక్టర్ నెగెటివ్ ఐన ఎన్టీఆర్ ఆ రోల్ ను పోషించిన విధానానికి జనం ఫిదా అయ్యారు. ఇప్పుడు మరోసారి అలాంటి రోల్ తోనే రాబోతున్నాడు యంగ్ టైగర్. అది కూడా ప్రశాంత్ నీల్ తో చేస్తోన్న మూవీ తో .. ఎస్ ప్రశాంత్ నీల్ మూవీకి ” అసురుడు” అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారా.. కొందరైతే అదే టైటిల్ అంటున్నారు.ఇక ఈ ప్రాజెక్టు అనౌన్స్ అయినప్పుడు ఎన్టీఆర్ లుక్ చూసినవాళ్లంతా మరో గొప్ప పాత్ర చేస్తున్నాడు అనే అనుకున్నారు. అది నిజమే అనిల్ ఈ కొత్త అప్డేట్ కనిపిస్తోంది.

అసురుడు అంటే రాక్షసుడు అని అర్థం కదా. రావణ్ పాత్రా అదే. కానీ ఈసారి ప్రశాంత్ నీల్ ఉన్నాడు. అందుకే అసురుడి రేంజ్ ని అంచనా వేయడం కూడా కష్టమే. ఎన్టీఆర్ లుక్ కి అసురుడు అనే టైటిల్ కి అద్భుతంగా మ్యాచ్ అవుతోంది. ఇక ప్రశాం లాంటి ఊరమాస్ దర్శకుకు ఈ మహా నటుడుని ఎలా ఉపయోగించుకుంటాడో కానీ మొన్న రావణ్ లా అదరగొట్టిన ఎన్టీఆర్ ఈసారి అసురుడు గా ఏం చేస్తాడో ఊహకే వదిలేయాలి.అసురుడు సరసన హీరోయిన్ గా అలియా భట్ ను తీసుకుంటారు అనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు జాహ్నవినీ అంటున్నారు.ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సాలార్ మూవీ చేస్తూనే ఎన్టీఆర్ అసురుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా చేస్తున్నాడు. ఏదేమైనా ఎన్టీఆర్ ను రాక్షస పాత్రల్లో లేదా ఆ పేర్లలో లోనే ఎందుకు చూస్తున్నారో కానీ ప్రేక్షకులకు మాత్రం ఒక బెస్ట్ మూవీ ఇస్తే చాలు..

, , , , , ,