ఖైదీ, రోలెక్స్ కలిసి నటిస్తున్నారా..

ఏ ఇండస్ట్రీలో అయినా అన్నదమ్ములిద్దరూ రాణించడం అరుదుగా కనిపిస్తుంది. ఒకప్పుడు క్రికెట్లో అన్నదమ్ములు కనిపించేవారు. అలాగే సినిమా పరిశ్రమలోనూ ఒకే ఇంటికి చెందిన అన్నదమ్ములు కనిపిస్తున్నారు. ఈ ట్రెండ్ బహుశా బాలకృష్ణ, హరికృష్ణతో స్టార్ట్ అయిందేమో. కానీ ఆ ఇద్దరూ రాణించలేదు. తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ తో తెలుగులో పీక్స్ కు వెళ్లింది.

అటుపై ఇదే ఫ్యామిలీ నుంచి అన్నదమ్ములు ఇప్పుడు ఉన్నారు. ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్, అక్కినేని నాగ చైతన్య, అఖిల్ ఇలా చాలామంది ఉన్నారు.

అయితే తమిళ్ లో ఈ ట్రెండ్ తక్కువే. అయినా ఉన్నవారిలో టాప్ ప్లేస్ లో ఉన్న బ్రదర్స్ సూర్య, కార్తీ. విశేషంగా ఈ ఇద్దరికి తెలుగులోనూ తిరుగులేని అభిమాన గణం ఉంది. తెలుగులో తమదైన ముద్రను బలంగా వేసి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. అందుకే ఈ అన్నదమ్ముల సినిమాలు విడుదలువుతున్నాయంటే తమిళ్ లో ఎంత సందడి ఉంటుందో తెలుగులోనూ అంతే ఉంటుంది. ఇలాంటి ఇద్దరు కలిసి నటిస్తే చూడాలని చాలామంది అనుకుంటున్నారు. తెలుగులో గెస్ట్ రోల్స్ కే పరిమితం అయింది. తమిళ్ లో వీళ్లిద్దరూ నటించబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి.


ఒకే దర్శకుడితో కార్తీ, సూర్య డిఫరెంట్ రోల్స్ లో మెరిశారు.ఆ రోల్స్ అన్ని కలిపి మల్టీవర్స్ గా మార్చాడు సదరు దర్శకుడు. అతను లోకేష్ కనకరాజ్ అని వేరే చెప్పక్కర్లేదు. లోకేష్‌ రెండో సినిమాగా వచ్చిన ఖైదీని లింక్ చేస్తూ రీసెంట్ గా విక్రమ్ అనే సినిమా చేశాడు. ఈ విక్రమ్ ను ఖైదీకి లింక్ చేస్తూ రోలెక్స్ అనే క్యారెక్టర్ ను క్రియేట్ చేశాడు. ఆ రోలెక్స్ కు ఖైదీకి ఉన్న రిలేషన్ నెక్ట్స్ మూవీలో తెలుస్తుంది. ఆ నెక్ట్స్ మూవీ ఎప్పుడు అనే ప్రశ్నకు అతి త్వరలోనే సమాధానం రాబోతోందనే వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇన్ డైరెక్ట్ గా ఓ ఎక్స్(ట్వీట్) చేశాడు కార్తీ. అది కన్ఫార్మ్ చేసినట్టు కాదు. బట్.. తామిద్దరూ కలిసి నటించేందుకు త్వరలోనే ఆస్కారం ఉందన్న సంకేతంలా ఉంది.


ఇక ఈ టాలెంటెడ్ బ్రదర్స్ ఇద్దరూ.. తమకు బాగా ఫేమ్ తెచ్చిన ఖైదీ, రోలెక్స్ పాత్రలతో అదే లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో నటిస్తే.. అప్పుడు తమ్ముడు హీరో అవుతాడు. అన్న విలన్ అవుతాడు. అన్నంటే ఏ పాత్రైనా ఇట్టే ఒదిగిపోతాడు. విలన్ అయినా, హీరో అయినా అతను చేయలేని పాత్రేలేదు. ఇక తమ్ముడుగా ఖైదీకి తగ్గ అమాయకత్వంతో పాటు హీరోయిజం కూడా యాడ్ చేశాడు. సో.. ఈ కాంబో సెట్ అయితే ఖచ్చితంగా ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవుతుందనే చెప్పాలి.

Related Posts