సెప్టెంబర్ 28.. మూవీస్ వర్సెస్ టీజర్

సెప్టెంబర్ 28న అనూహ్యంగా బిగ్ ఎంటర్టైన్మెంట్ ఫిక్స్ అయింది. సలార్ పోస్ట్ పోన్ కావడంతో కొన్ని చిన్న సినిమాలు ఆ డేట్ ను ఆక్యుపై చేశాయి. ఆ చిన్న సినిమాలను బెదిరిస్తూ ఆల్రెడీ 15న షెడ్యూల్ అయి ఉన్న స్కంద, చంద్రముఖి2 కూడా 28కి తమ సినిమాలు వాయిదా వేసుకున్నాయి. బట్ ఈ డేట్ మిస్ అయినందుకు ఇప్పుడు బాధపడుతూ ఉంటారు. అయితే ఈ రెండు సినిమాలతో పాటు పెదకాపు1 29న వస్తోంది. 28న మ్యాడ్, ద వ్యాక్సిన్ వార్ అనే చిత్రాలు 28న రాబోతున్నాయి.

స్కంద, చంద్రముఖి2 చిత్రాలపై ప్రేక్షకుల్లో అంచనాలున్నాయి. వాటిని అందుకుంటాయా లేదా అనేది పక్కన బెడితే అసలు వీళ్లు ఇంత వరకూ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయలేదు. రిలీజ్ కు పది రోజులే ఉన్నా.. పట్టుమని ఒక్క ఇంటర్వ్యూ కూడా ప్లాన చేయలేదు. స్కంద నుంచి వినాయక చవితి సందర్భంగా వచ్చిన పాట ఐటమ్ సాంగ్. అది సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పలేం. ఇక చంద్రముఖి 2 తెలుగులోనే కాదు.. తమిళ్ లో కూడా పెద్దగా సందడి చేయడం లేదు. పైగా ఈ రెండూ ప్యాన్ ఇండియన్ సినిమాలుగా వస్తున్నాయి. అయితే వీరికి పోటీగానా అన్నట్టుగా సెప్టెంబర్ 28న యానిమల్ టీజర్ వస్తోంది.


అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగా ఆ చిత్రాన్నే బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్కడా బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ బ్లాక్ బస్టర్ తో అతన్ని బాలీవుడ్ కట్టిపడేసింది. నెక్ట్స్ మూవీ కూడా అక్కడే చేశాడు. బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన రణ్‌బీర్ కపూర్ తో ‘యానిమల్’ అనే సినిమా చేశాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. నిజానికి ఈ మూవీ ఆగస్ట్ 11నే రావాలి. కానీ పాటలు పూర్తి కాలేదని.. డిసెంబర్ 1కి వాయిదా వేశాడు సందీప్. ఇందుకోసం ఓ మంచి వివరణ కూడా ఇచ్చాడు. కొన్నాళ్ల క్రితం వచ్చిన యానిమల్ మూవీ గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ టీజర్ తో ఓ రేంజ్ ఇంపాక్ట్ వేయబోతున్నాడు అంటున్నారు.

యానిమల్ టీజర్ ఊహించని రేంజ్ లో ఉంటుందని బి టౌన్ టాక్. అందుకే సెప్టెంబర్ 28న విడుదలయ్యే సినిమాల కోసం ఎంత ఈగర్ గా చూస్తున్నారో.. ఈ యానిమల్ టీజర్ కోసం కూడా అంతే చూస్తున్నారు. ఈ టీజర్ తో నెక్ట్స్ బాలీవుడ్ ను షేక్ చేయబోయే సినిమా యానిమల్ అని ఫిక్స్ అయిపోయేలా ఉంటుందంటున్నారు. అందుకే ప్రస్తుతం ఈ వార్ ను సెప్టెంబర్ 28 మూవీస్ వర్సెస్ యానిమల్ టీజర్ గా చూస్తున్నారు.

Related Posts