అజిత్ కు ఈ తెగింపుతో ముగింపేనా..

రొటీన్.. ఈ మాట చాలా సినిమాలకు వర్తిస్తుంది. ఇక తమిళ్ లో అయితే స్టార్ హీరోలు కూడా ఈ మాటను దాటి సినిమాలు చేయడానికి పెద్దగా ఇష్టపడరు. విచిత్రంగా అక్కడి అభిమానులు కూడా వాటినే బ్లాక్ బస్టర్స్ చేస్తుంటారు. బట్ అవే సినిమాలు ఇతర భాషల్లో డబ్ అయితే మాత్రం ఎవరూ పట్టించుకోరు. అంత వీక్ గా ఉంటుంది కంటెంట్.

ఇప్పుడు తెలుగులో తెగింపు అనే టైటిల్ తో రాబోతోన్న అజిత్ కుమార్ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత కూడా చాలామంది ఏముందీ ఇందులో అంటున్నారు. మరి ఈ తెగింపు కాస్తా అటూ ఇటైతే.. ఇక అజిత్ తెలుగు మార్కెట్ కు ముగింపు అవుతుందేమో.. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.


అజిత్ కుమార్.. హైదరాబాద్ నుంచే తమిళనాడు వెళ్లిన ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. అందగాడుగా సినిమాల్లోకి ఎంటర్ అయ్యాడు. మొదట్లో అన్నీ క్లాస్ సినిమాలే చేసినా తర్వాత మెల్లగా మాస్ రూట్ లోకి వచ్చాడు. ఆల్రెడీ ఉన్న క్లాస్ ఫ్యాన్స్ కు మాస్ ఫ్యాన్స్ కూడా తోడై.. టాప్ హీరోగా మారాడు. అయితే కొన్నాళ్లుగా అతని సినిమాలు చూస్తే బిల్డప్ తప్ప మరోటి కనిపించడం లేదు అనే టాక్ అక్కడ కూడా వినిపిస్తోంది.

ముఖ్యంగా యాక్షన్స్ సీక్వెన్స్ కు ఇస్తోన్న ఇంపార్టెన్స్ కథకు ఉండటం లేదు. ముఖ్యంగా కేవలం తమిళ ప్రేక్షకులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని కథలు ఎంచుకుంటున్నట్టుగా అర్థం అవుతుంది. అందుకే ఆ సినిమాలేవీ ఇక్కడ ఆడటం లేదు. అయినా అక్కడ స్టార్డమ్ పెరుగుతుంది. చివరగా వచ్చిన వలిమై లాంటి వీక్ స్టోరీని ఎంచుకున్న అతను మరోసారి అదే దర్శకుడు హెచ్ వినోద్ తునివుగా వస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో తెగింపు అనే పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ చూస్తే మేటర్ ఎంత వీక్ గా ఉందో అర్థం అవుతుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన విజయ్ సినిమా బీస్ట్ లైన్ లోనే ఈ ట్రైలర్ ఉంది. ఇంకా చెబితే దర్శకుడు స్పానిష్ వెబ్ సిరీస్ మనీ హెయిస్ట్ నుంచి ఇన్ స్పైర్ అయినట్టుగా ఇందులోనూ ఓ బ్యాంక్ ముట్టడించడం.. తర్వాత భారీ తుపాకులు, బాంబ్ ల మోత తప్ప కంటెంట్ అంటూ ఏం కనిపించడం లేదు అనే విమర్శలు కోలీవుడ్ లోనూ వినిపిస్తున్నాయి.

అయితే ఇలాంటి వీక్ కంటెంట్ తోనే అతను వలిమైతే 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాదించాడు. బట్ ఇప్పుడు చూస్తే ఇది బీస్ట్ లా కనిపిస్తోందంటున్నారు. సో.. ఈ సారి అజిత్ కు ఇక్కడ కంటే అక్కడే పెద్ద షాక్ తగిలేలా ఉందంటున్నారు. మరోవైపు ఇప్పటికే తెలుగులో చాలా చిన్న మార్కెట్ ఉంది అజిత్ కు. ఇక ఈ తెగింపు కూడా అటూ ఇటైతే ఈ మార్కెట్ కు కూడా ముగింపు అవుతుంది.

Related Posts