ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు మేర్లపాక గాంధీ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ఎ ఎం బీ మాల్ లో ప్రమోషన్ ప్లాన్ ఎవరిది ? ఎ ఎం బీలో లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని షూట్ చేయడానికి వెళ్లాం. అయితే సినిమా వస్తుందని ఎంతమందికి తెలుసనే ఒక ఆలోచన వచ్చి షూట్ చేయమని చెప్పాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ స్టొరీ ఐడియా ఎప్పుడు వచ్చింది ? లాక్ డౌన్ సమయంలో అందరికీ తీరిక దొరికింది. అప్పుడే చాలా మంచి యూట్యూబ్ కంటెంట్ కి అలవాటు పడ్డారు. ఆ సమయంలో ఎలాగూ బయటికి వెళ్ళలేం కాబట్టి కనీసం ట్రావెల్ వీడియోస్ చూస్తే బయటికి వెళ్ళిన ఫీలింగ్ వుంటుందని ఎక్కువగా ట్రావెల్ వ్లాగ్ వీడియోస్ చూశాను. అది చాలా నచ్చింది. ప్రదేశాలు గురించి, వాటి చరిత్ర గురించి చెప్పడం చాలా ఇంట్రస్టింగా అనిపించింది. ఒక యూట్యుబర్ కథ చేస్తే బావుంటుందనే ఆలోచన మొదలైయింది. ట్రావెల్ వ్లాగర్ కి వున్న కష్టాలు, ప్రమాదాలు, సవాళ్ళు బ్యాక్ డ్రాప్ లో సినిమాని ప్లాన్ చేశాం. ట్రావెల్ వ్లాగ్, యూట్యుబర్ లైఫ్ తో లిమిటెడ్ ఆడియన్స్ రిలేట్ చేసుకుంటారు కదా ? కామన్ ఆడియన్స్ కి ఈ కథ ఎంత రిలేటెడ్ గా వుంటుంది ? లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కథ చాలా హిలేరియస్ గా వుంటుంది. హీరో, హీరోయిన్ ఇద్దరూ ట్రావెల్ వ్లాగర్స్ . వీరి మధ్య ఫైట్ చాలా ఆసక్తికరంగా వుంటుంది. ట్రావెల్ వీడియోలు షూట్ చేసే క్రమంలో ఎలాంటి ప్రమాదం ఎదురుకున్నారనేది కూడా చాలా ఇంటరెస్టింగా వుంటుంది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ ఫస్ట్ ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకూ ఒక లాఫ్ రైడ్ లా వుంటుంది. అండర్ కరెంట్ గా ఒక సమస్య రన్ అవుతూనే .. ఆ పరిస్థితి నుండి వచ్చే సిట్యువేషనల్ కామెడీ అద్భుతంగా వుంటుంది. మీ సినిమాల్లో స్క్రీన్ ప్లే స్పెషల్ ఎట్రాక్షన్ కదా.. మరి ఇందులో ఎలా వుంటుంది ? లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా వుంటుంది. ప్రతి పదిహేను నిమిషాలకు కథలో ఒక చేంజ్ ఓవర్, మలుపు వుంటుంది. సిట్యువేషనల్ కామెడీ ప్రధాన ఆకర్షణగా వుంటుంది. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్ లో ఎలా చేశారు ? సంతోష్ శోభన్ తో ఏక్ మినీ కథ చేశాను. అందులో తన నటన బాగా నచ్చింది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ లో ఒక యూట్యుబర్ గా యంగ్ యాక్టర్ కావాలని సంతోష్ తో కథ చెప్పడం జరిగింది. తనకి చాలా నచ్చింది. అలాగే జాతిరత్నాలు తర్వాత ఫారియా ఈ సినిమా చేసింది. తను సహజంగా ఎలా వుంటుందో సినిమాలో కూడా అలానే కనిపించింది. ఇద్దరూ పర్ఫెక్ట్ గా సరిపోయారు. సుదర్శన్, బ్రహ్మాజీ పాత్రల గురించి ? సుదర్శన్ ట్రావెల్ వ్లాగ్ షూట్ చేసే డివోపీ గా దాదాపు సినిమా అంతా ఉంటాడు. ఈ పాత్ర లో చాలా ఫన్నీగా ఉంటాడు. ఇందులో పిపిఎఫ్ అనే గ్యాంగ్ వుంటుంది. దానికి హెడ్ గా కనిపిస్తారు బ్రహ్మాజీ. చాలా రోజుల తర్వాత బ్రహ్మాజీ గారు అద్భుతంగా చేసిన క్యారెక్టర్ అని నాకు అనిపించింది. ఆయన పాత్ర కూడా దాదాపుగా సినిమా అంతా వుంటుంది. చాలా లైట్ హార్టెడ్ గా సరదాగా ఎంజాయ్ చేసే హిలేరియస్ ఎంటర్ టైనర్ ఇది. ప్రభాస్ గారు ఈ సినిమా కోసం ఆసక్తి చూపిస్తున్నట్లు వున్నారు ? యూవీ క్రియేషన్స్, ప్రభాస్ గారు మాకు వెరీ క్లోజ్. వారి బ్యానర్ లో సినిమాలు చేశాం. తర్వాత కూడా చేయబోతున్నాను. నా, సంతోష్ శోభన్ సినిమా అంటే తప్పకుండా యూవీ క్రియేషన్స్ హెల్ప్ చేస్తోంది. చిన్న సినిమాలకి ప్రేక్షకులు చాలా సెలెక్టెడ్ గా థియేటర్ కి వస్తున్నారు కదా.. ఆ భయం ఏమైనా ఉందా ? వుందండీ. అందుకే చాలా కొత్తగా వైవిధ్యంగా ప్రమోట్ చేస్తున్నాం. జనాల్ని మార్నింగ్ షోకి తీసుకురావాలనేది మా టార్గెట్. మంచి టాక్ స్ప్రెడ్ అయితే, సినిమా బావుంటే ఖచ్చితంగా చూస్తారు. మీ మొదటి సినిమా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ కి స్క్రీన్ ప్లే లో చాలా మంచి పేరు

Read More

ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ విడుదలకు సిద్ధమైయింది. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది.ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ”లచ్చమమ్మో’ వీడియో సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్. ప్రవీణ్ లక్కరాజు ఈ పాటనీ ట్రెండీ ఫోక్ సాంగ్ గా కంపోజ్ చేసిన విధానం ఆకట్టుకుంది. గోరేటి వెంకన్న ఈ పాటకు సాహిత్యం అందించగా రామ్ మిరియాల తనదైన వాయిస్ తో మెస్మరైజ్ చేశారు. ఈ పాటలో సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా కెమిస్ట్రీ అలరిస్తోంది. పాటలో కలర్ ఫుల్ అండ్ ప్లజంట్ బీచ్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, వసంత్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Read More

ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల యూత్‌ఫుల్ లవ్ అండ్ క్రైమ్ ఎంటర్‌టైనర్ ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ నవంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోష‌న్స్

Read More

దర్శకుడు మేర్లపాక గాంధీ హిలేరియస్ ఎంటర్‌ టైనర్‌ లను డీల్ చేయడంలో దిట్ట. ఆయన తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కంప్లీట్ ఎంటర్‌ టైనర్. దీంతో పాటు క్రైమ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నారు. సంతోష్ సూపర్‌హిట్ ‘ఏక్ మినీ కథ’ కు మేర్లపాక గాంధీ కథ, స్క్రీన్‌ప్లే అందించిన సంగతి తెలిసిందే. తాజాగా లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ టీజర్‌ ను హీరో నితిన్ లాంచ్ చేశారు. సంతోష్ శోభన్ తన స్నేహితుడైన కెమెరామెన్ నెల్లూరు సుదర్శన్‌తో కలిసి అందమైన ప్రదేశాలకు ప్రయాణించి ట్రావెల్ బ్లాగర్‌ గా మారాలనుకుంటున్నాడు. సంతోష్ ప్రయాణంలో అందమైన అమ్మాయి ఫరియా అబ్దుల్లాను కలుస్తాడు. ఆమెను ఫ్లిర్ట్ చేయాలని ప్రయత్నిస్తాడు. హిలేరియస్ గా సాగుతున్న టీజర్ సెకండాఫ్‌లో సినిమా క్రైమ్ పార్ట్ చూపించడం క్యురియాసిటీని పెంచింది. క్రైమ్, కామెడీ చాలా ఎక్సయిటింగ్ కాంబినేషన్. టీజర్ ప్రామిసింగ్ గా వుంది. మేర్లపాక గాంధీ రొమాన్స్ తో పాటు క్రైమ్, కామెడీ అంశాలను కలిగి ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నారు. వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా రూపొందిందని టీజర్‌ ద్వారా తెలుస్తోంది. పక్కింటి అబ్బాయిలా కనిపించిన సంతోష్ శోభన్ కామిక్ టైమింగ్ అద్భుతంగా ఉంది. టీజర్‌లో ఫరియా అబ్దుల్లా అందంగా కనిపించింది. నెల్లూరు సుదర్శన్‌ది సంతోష్‌ తో పాటు ప్రయాణించే కీలక పాత్ర. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా ఫన్నీగా ఉంది. ఆద్యంతం వినోదాత్మకంగా అలరించిన టీజర్ సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పింది. బ్లాక్ బస్టర్ హిట్ ‘శ్యామ్ సింగరాయ్‌’ ని అందించిన వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ తో కలిసి ఆముక్త క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, వసంత్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. నవంబర్‌లో ఈ సినిమా థియేటర్లలోకి రానుందని మేకర్స్ ట్రైలర్‌ ద్వారా తెలియజేశారు. తారాగణం: సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, నెల్లూరు సుదర్శన్ సాంకేతిక సిబ్బంది: రచయిత, దర్శకత్వం: మేర్లపాక గాంధీ నిర్మాత: వెంకట్ బోయనపల్లి బ్యానర్లు: ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్ సంగీతం: ప్రవీణ్ లక్కరాజు డీవోపీ: వసంత్ ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటరత్నం (వెంకట్) పీఆర్వో: వంశీ-శేఖర్

Read More

ఒక సినిమా మేకింగ్ లో ఉన్నప్పుడే ఆ దర్శకుడి కెపాసిటీ ఏంటో సీనియర్ హీరోలకు తెలిసిపోతుంది. దీంతో తాము మేకింగ్ లో ఇన్వాల్వ్ కావాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుంటారు. ఆ డెసిషన్ ను

Read More

వరుసగా ఎన్ని ఫ్లాపులు వచ్చినా.. ఒక్క బ్లాక్ బస్టర్ అవన్నీ మర్చిపోయేలా చేస్తుంది అనేది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నమాట. ఆ విషయం మాస్ మహరాజ్ రవితేజ విషయంలో మరోసారి ప్రూవ్ అయింది. క్రాక్

Read More

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా రూపొందుతోన్న సినిమా రావణాసుర. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా ఓ కొత్త అప్డేట్ ఇచ్చారు. రావణాసురలో

Read More