2022లో మాస్ రాజా రవితేజ తీన్మార్

వరుసగా ఎన్ని ఫ్లాపులు వచ్చినా.. ఒక్క బ్లాక్ బస్టర్ అవన్నీ మర్చిపోయేలా చేస్తుంది అనేది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నమాట. ఆ విషయం మాస్ మహరాజ్ రవితేజ విషయంలో మరోసారి ప్రూవ్ అయింది. క్రాక్ కు ముందు ఫ్లాపులతో ఇబ్బంది పడ్డాడు రవితేజ. క్రాక్ బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు తన దూకుడును డబుల్ చేశాడు. వరుస అనౌన్స్ మెంట్స్, షూటింగ్స్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఖిలాడీని వచ్చే నెల 11న విడుదల చేయబోతోన్న రవితేజ.. రామారావు ఆన్ డ్యూటీ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేస్తున్నాం అని ఆల్రెడీ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. అప్పటికి సిట్యుయేషన్స్ మారే అవకాశాలున్నాయి. సో.. ఈ డేట్స్ ఇలాగే ఉంటాయని చెప్పలేం. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీతో పాటు టైగర్ నాగేశ్వరరావు అనే మరో మూవీ కూడా చేస్తున్నాడు రవితేజ. ఈ మూవీ చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుంది అనేది ఇంకా చెప్పలేదు. కానీ సుధీర్ వర్మ డైరెక్షన్ లో రూపొందే రావణాసుర మాత్రం రీసెంట్ గా భోగ పండగ రోజు మెగాస్టార్ చేతుల మీదుగా ప్రారంభం అయింది. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ఈ చిత్రంలో రవితేజ ఫస్ట్ టైమ్ పూర్తిస్థాయిలో ఓ లాయర్ పాత్ర చేస్తుండటం విశేషం. సుశాంత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఫరియా అబ్దుల్లా, దక్షా నాగార్కర్, మేఘా ఆకాశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
సుధీర్ వర్మ దర్శకుడుగా ప్రతిభావంతుడు అని పేరు తెచ్చుకున్నా.. కమర్షియల్ విజయాలు అందుకోలేకపోతున్నాడు. రావణాసురతో గట్టిగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇక రావణాసురను సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నట్టు షూటింగ్ ప్రారంభం అయిన రోజునే ప్రకటించారు. అంటే ఆ టార్గెట్ గానే చిత్రీకరణ కొనసాగుతుందన్నమాట. మధ్యలో కరోనా వల్ల వచ్చే ఇబ్బందులు గురించి వీళ్లు లెక్కలు వేసుకున్నారా లేదా తెలియదు కానీ.. సెప్టెంబర్ 30 టార్గెట్ గా రావణాసుర చిత్రీకరణ కొనసాగుతుంది. ఈ టార్గెట్ ను వీళ్లు నిజంగానే ఛేదిస్తే మాస్ రాజా నుంచి ఈ యేడాది మూడు సినిమాలు వస్తాయన్నమాట. ఏదేమైనా ఇలా రిలీజ్ డేట్ పెట్టుకుని చిత్రీకరణ చేస్తే.. అవుట్ పుట్ పై ఎఫెక్ట్ పడుతుందని ఇప్పటికే చాలా సినిమాలు రుజువు చేశాయి. అయినా రావణాసుర అదే రూట్ లో వెళ్లడం వెనక రీజనేంటో వారికే తెలియాలి.

Related Posts