రికార్డ్ బ్రేక్ మూవీ రివ్యూ

రికార్డ్ బ్రేక్ సినిమా మొదటి నుంచి ఆసక్తి కలిగిస్తూనే ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ప్రతీ భారతీయుడు చూడదగ్గ సినిమా అంటూ ప్రచారం చేసారు. చదలవాడ శ్రీనివాసరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ ప్రచారానికి తగ్గ రిజల్ట్ రాబట్టిందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ : ఓ ఇద్దరు పిల‌్లలు కోటీశ్వరుల ఇంట్లో జన్మిస్తారు.. కానీ అనుకోని పరిస్థితులు వారిని అనాధలుగా మార్చుతాయి. అయితే ఆ ఇద్దరికి ఓ అమ్మాయి పరిచయం కావడం.. ఆ అమ్మాయే తల్లిలా మారి ప్రోత్సాహించడం.. విలేజ్‌నుంచి ఇంటర్నేషనల్ స్థాయి రెజ్లర్స్‌గా వీరు మారడం అనేది ఆసక్తికర కథాంశం తెరమీద చూడాల్సిందే.

నటీనటులు :
ఈ సినిమాలో మెయిన్ లీడ్ చేసిన నిహార్ కపూర్, నాగార్జున , రగ్దా ఇఫ్తాకర్ లు కొత్తవాళ్లే.. కానీ చాలా బాగా నటించారు. రెజ్లర్ లకు తగ్గ బాడీ, బాడీలాంగ్వేజ్‌ చక్కగా ప్రదర్శించారు. అటు అమాయకత్వం ఇటు రెజ్లింగ్ విన్యాసాలు బాగా పలికించారు. ప్రతీ సన్నివేశం,ప్రతీ డైలాగ్‌ ఉత్తేజపరిచేలా ఉంటాయి. సంజన , సోనియాలు చక్కగా నటించారు. ముఖ్యంగా సత్య కృష్ణ పాత్ర బాగా హైలెట్ అవుతుంది. విలన్ పాత్రలో ప్రసన్నకుమార్ ఆకట్టుకంటాడు.

టెక్నికల్ టీమ్‌ :
ఈ సినిమాకి కర్త కర్మ క్రియ చదలవాడ శ్రీనివాసరావు. చాలా బాగా డిజైన్ చేసారు. డైరెక్షన్‌ చక్కగా ఉంది. అంగిరెడ్డి శ్రీనివాస్ అందించిన కథ సాబు వర్గీస్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. డిఓపిగా కంతేటి శంకర్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది.

బోటమ్‌ లైన్ : రికార్డ్ బ్రేక్‌ – ప్రతీఒక్కరు చూడదగ్గ సినిమా.

Telugu70MM Rating : 3/5

Related Posts