HomeReviewsభీమా రివ్యూ

భీమా రివ్యూ

-

గోపీచంద్ , మాళవిక శర్మ, ప్రియాభవాని శంకర్‌ మెయిన్ లీడ్‌ గా ఎ. హర్ష డైరెక్షన్‌లో కెకె రాధామోహన్‌ నిర్మించిన మూవీ ‘భీమా’ . భారీ అంచనాలున్నాయి. సెమీ ఫాంటలసీ ఎలిమెంట్ ఉన్న కమర్షియల్ మూవీ కావడంతో బజ్ బాగా పెరిగింది. అ అంచనాలను భీమా అందుకుందా ?


ఎలాంటి క్రిమినల్‌నైనా ఆటకట్టించే పోలీసాఫీసర్‌ భీమా ( గోపీచంద్) . స్కూల్ టీచర్‌ గా పనిచేస్తున్న విద్య తో లవ్‌లో పడిపోతాడు. అయితే మహేంద్రగిరికి రాజులాంటి భవాని ( ముఖేష్‌తివారి) కి భీమా కొరకరాని కొయ్యలా మారతాడు. ఆయుర్వేద మందులతో ఊరిని కాపాడుతున్న రవీంద్ర వర్మ ( నాజర్ ) భీమాని ఓ కోరిక కోరతాడు. ఆ తర్వాత ఏం జరిగింది భవానీ, భీమాల మధ్య గొడవేంటి ? వర్మ చెప్పిన మాట భీమా ఎలా తీర్చాడనేది తెరమీద చూడాల్సిందే.


గోపీచంద్ మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లు బోర్‌ కొట్టే స్థాయికి వచ్చేసాయి. అయితే ఇందులో ఉన్న పురాణాల పాయింట్‌కు లింక్ చేస్తూ చేసిన యాక్షన్‌ ఎలిమెంట్స్‌ కాస్త ఇంట్రస్టింగ్ పాయింట్‌. పరశురాముని క్షేత్రం గురించి తెలుపుతూ వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ఎమోషన్స్, పవర్‌ఫుల్ డైలాగ్‌లు, కీలకమైన ట్విస్ట్ మరియు హీరోయిజం ఎలివేషన్ సన్నివేశాలు చక్కగా కుదిరాయి మరియు వీటి కారణంగా సీన్స్ బాగా పండుతాయి. వెన్నెల కిషోర్ మరియు రోహిణి పాల్గొన్న కొన్ని కామెడీ మూమెంట్స్ బాగా వచ్చాయి. మంచి ఇంట్రడక్షన్ సీన్ అనంతరం కథనం మెల్లగా సాగుతుంది. అనంతరం వచ్చే లవ్ ట్రాక్ తో పాటు మాస్ ఆడియన్స్ కోసం రాసుకున్న కొన్ని వల్గర్ సీన్స్ అయితే కొన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి ఇబ్బందిగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా భీమా పాత్ర పై నడిపించారు,ఇంటర్వెల్ బ్లాక్‌ వరకు కథలో మెయిన్ పాయింట్ తెలియకుండా నడపడం కొంత అసహనాన్ని కలిగిస్తుంది.

నటీనటులు : గోపీచంద్ కు ఇలాంటి సినిమాలు కొట్టినపిండే. యాక్షన్‌ ఇరగదీసాడు. మాళవిక శర్మ పాత్ర ఆకట్టుకుంటుంది. కొన్ని సన్నివేశాల్లో మాళవిక చక్కగా నటించింది. ప్రియా భవాని పాత్ర పరిధిమేరకు నటించింది. ముఖేష్ తివారి, ఇతర పాత్రధారులు తమ పాత్రలకు న్యాయం చేసారు.


ఈ సినిమాకి ప్రధాన బలం విజువల్స్, నైట్‌ సీన్స్ సూపర్‌గా క్యాప్చర్ చేసారు. ఈ విషయంలో స్వామి జె గౌడ పనితనం సూపర్‌సక్సెస్‌. ఇక మ్యూజిక్ రవి బస్రూర్ మరో హైలైట్‌. కోర్ పాయింట్ ని ఎలివేట్ చేయడంలో.. ఇంకాస్త థ్రిల్లింగ్ గా కథను చెప్పడంలో ఎ. హర్ష అంతగా ఆకట్టుకోలేకపోయాడని చెప్పాలి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బోటమ్‌ లైన్ : భీమా – యాక్షన్‌ అడ్వంచరస్ డ్రామా

ఇవీ చదవండి

English News