భ్రమ యుగం రివ్యూ

భ్రమ యుగం.. ఈ టైటిల్‌తోనే అత్యంత ఆసక్తి క్రియేట్ చేసిన సినిమా. ముఖ్యంగా మమ్ముట్టి మెయిన్‌ లీడ్ చేస్తుండటం బ్లాక్‌ అండ్ వైట్‌ లో రాబోతుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అనుకున్నట్టుగానే ఫిబ్రవరి 23 న సినిమా రిలీజయ్యింది. ఇంతకీ ఈ సినిమా అంచనాలను అందుకుందా లేదా ఈ రివ్యూలో చూద్దాం.

కథ : భారత దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు మొదలయ్యే సినిమా ఇది. పోర్చుగీసు వారు దేవన్‌ (అర్జున్‌ అశోకన్‌) అనే దళిత యువకుడ్ని బానిసగా మార్చి అమ్మే క్రమంలో అతను తప్పించుకుంటాడు. అడవిలో ఓ పాత బంగళాకు చేరుకుంటాడు. అందులో ఇద్దరే ఉంటుంటారు. తుడుమన్ పోటీ (మమ్ముట్టి).. అతనికి వంట చేసే వంటవాడు (సిద్దార్ధ్ భరతన్‌). తుడుమన్ దేవన్‌ని అతిధిగా గౌరవించి ఆశ్రయం కల్పిస్తాడు. కానీ తుడుమన్‌ ఎవరో అసలు నిజం తెలుసుకుని అక్కడి నుంచి పారిపోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు దేవన్‌.కానీ పారిపోలేకపోతాడు. అసలు తుడుమన్ ఎవరు.. దేవన్‌ చివరికి తప్పించుకున్నాడా లేదా.. అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ : హర్రర్‌ బ్యాక్‌డ్రాప్‌ అని ప్రచారం సాగిన ఈ సినిమా వాస్తవానికి ఓ ప్రయోగం. హర్రర్‌ ఫ్లేవర్‌తో ఇలాంటి సినిమాని ఇంతకు ముందు చూసి ఉండరు. పైగా టెక్నికల్‌గా ఇంత అడ్వాన్స్‌డ్‌ స్టేజ్‌లో ఉన్న తరంలో పూర్తిగా బ్లాక్‌ అండ్ వైట్‌ ఫార్మేట్‌లో సినిమా రూపొందించడం సాహసమే.. కథ మొదలైన పదినిమిషాల్లోనే ప్రేక్షకుడు ఈ బ్లాక్‌ అండ్ వైట్‌ భ్రమయుగం ప్రపంచంలోకి లీనమవుతారు. అంత ఓ మనిషి దెయ్యాల కొంపకు చేరడం.. అక్కడి నుంచి బయటపడే కాన్సెప్ట్‌లతో చాలా సినిమాలొచ్చాయి. అయితే భ్రమయుగం వాటికి భిన్నంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మమ్ముట్టి పోషించిన తుడుమన్ పోటీ పాత్ర మనల్ని అబ్బురపరుస్తుంది. మమ్ముట్టి యాక్టింగ్‌తో మెస్మరైజ్‌ చేస్తాడు. ఓవరాల్‌గా కేవలం మూడు పాత్రలతోనే సాగే ఈ సినిమా అక్కడక్కడా సాగతీతలా అనిపిస్తుంది కానీ.. నటీనటుల నటప్రతిభ ప్రేక్షకులను ముగ్ధులని చేస్తుంది. ఓ రెండు పాత్రల గెస్ట్‌ రోల్‌ లో కనిపిస్తాయి. ఫస్టాఫ్ కాస్త స్లో నేరేషన్‌ లో కథ చెప్పాడు డైరెక్టర్‌ సదాశివన్‌. ప్రీ ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌ మాత్రం ఆడియెన్స్‌లో మరింత ఆసక్తి రేకెత్తించింది. ఇక సెకండాఫ్ నుంచి కథ స్పీడందుకుంటుంది. క్లైమాక్స్‌ లో మమ్ముట్టి నటన పీక్స్‌. హర్రర్‌ సినిమా అయినా అంతగా భయపెట్టే సినిమా కాదు కానీ.. కొన్ని సీన్స్ మాత్రం గుండె ఝల్లుమనేలా .. గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉంటాయి.

నటీనటులు : మమ్ముట్టి మళయాళ మెగాస్టార్‌.. అయినా ఇలాంటి పాత్ర చేయడం నిజంగా సాహసమే.. హావభావాలతో కట్టిపడేసాడు మమ్ముట్టి. అర్జున్‌ అశోకన్‌, సిద్దార్ధ్ భరతన్‌ లు మంచి నటులని ప్రూవ్ చేసుకున్నారు. గెస్ట్ రోల్స్‌ చేసిన వారు పరిధి మేరకు నటించి వెళ్లిపోతారు.

టెక్నిషియన్స్‌ : డైరెక్టర్‌ సదాశివన్ ఎంచుకున్న రూటే సెపరేట్‌. బ్లాక్ అండ్ వైట్‌లో సినిమా తీయాలన్న సంకల్పం సెన్సేషన్‌ అయితే.. ఆడియెన్స్‌ని అందులో లీనం చేయడంలో సక్సెస్‌ అయ్యాడు. ముఖ్యంగా మూడే పాత్రలతో కేవలం ఓ ఇంటి లొకేషన్‌లో సినిమా ఆసాంతం ఆసక్తికరంగా నడిపించడం మామూలు విషయం కాదు. హర్రర్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలకు ప్రధానాకర్షణ మ్యూజిక్‌. క్రిస్టో జేవియర్‌ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ సూపర్బ్‌. విజువల్స్‌ థ్రిల్లిస్తాయి.

బోటమ్‌ లైన్ : భ్రమయుగం.. హర్రర్‌ ఎక్స్‌పరిమెంట్‌

రేటింగ్‌ : 2.5 / 5

Related Posts