శ్రీ విష్ణు చేతుల మీదుగా ‘మార్కెట్‌ మహాలక్ష్మి’ టీజర్ లాంచ్‌

మార్కెట్ మహాలక్ష్మికి హీరో శ్రీవిష్ణు సపోర్ట్‌ దొరికింది. పార్వతీశం, ప్రణీకాన్విక జంటగా.. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర టీజర్‌ను యంగ్ టాలెంట్ శ్రీ విష్ణు లాంచ్‌ చేసారు.
ఈ చిత్ర టీజర్‌ తనకు చాలా బాగా నచ్చిందన్నారు శ్రీ విష్ణు. కామెడీతో పాటు హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్‌ చాలా బాగుందన్నారు.
తమ సినిమా టీజర్ రిలీజ్‌ చేసిన హీరో శ్రీవిష్ణుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ చిత్ర హీరో పార్వతీశం. మార్కెట్ మహాలక్ష్మి లాంటి సబ్జెక్ట్ ఓరియెంటెడ్ కధలు శ్రీ విష్ణు గారు గతంలో చాలానే చేశారు, చేస్తూనే ఉన్నారు. సో, మా సినిమా టీజర్ అలాంటి వ్యక్తి ద్వారా రీలిజ్ కావడం నాకు ఆనందంగా ఉందన్నారు కమెడియన్‌ మహబూబ్ భాషా.

Related Posts