‘ఆదికేశవ’ ట్విట్టర్ రివ్యూ..వైష్ణవ్ కి మాస్ హిట్ గ్యారెంటీ

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, యంగ్ బ్యూటీ శ్రీలీల నటించిన తాజా చిత్రం ‘ఆదికేశవ. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై ముందు నుండి భారీ అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే థియేటర్స్‌లోకి వచ్చిన ఆదికేశవ సినిమాపై ఫ్యాన్స్ ట్విట్టర్ లో తమ రివ్యూను ఇచ్చారు.

ఫన్నీ ఫస్ట్ హాఫ్.. కథలో సీరియస్ ట్విస్ట్‌తో ముగియగా, సెకండ్ హాఫ్ ఫన్నీ రివీల్‌తో ముగిసింది. డల్ మూమెంట్ కాదు, ఓవరాల్ గా చిన్న బడ్జెట్ తో చేసిన మంచి మాస్ సినిమా..ఆదికేశవ అని ట్వీట్ చేశారు.

ఎన్.టి.ఆర్ నటించిన సింహాద్రి సినిమాలోని నువ్వు విజిలేస్తే ఆంధ్రాసోడా బుడ్డి సాంగ్ బావుందని, శ్రీలా డాన్స్ సూపర్ అని పోస్ట్ పెట్టాడు.

అలాగే అల్లు అర్జున్ నటించిన రాములో రాముల సాంగ్ కి శ్రీలీల అదిరిపోయే డాన్స్ చేసిందని మరో అభిమాని ట్వీట్ చేశాడు. మొత్తానికి ఆదికేశవ సినిమాకి ట్విట్టర్ లో అన్నీ పాజిటివ్ రివ్యూస్ రావడం సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

Related Posts