యశ్.. ఇన్నాళ్లకు ఎస్ అన్నాడు

కన్నడ నాట స్వయంకృషితో ఎదిగి ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిన ఏకైక స్టార్ హీరో యశ్. అతని కెరీర్ ను కేజీఎఫ్ కు ముందు కేజీఎఫ్‌ తర్వాత అన్నట్టుగా చూస్తున్నారు. కేజీఎఫ్ కు ముందు వరకూ అతని గురించి సౌత్ లోనే పెద్దగా తెలియదు. కానీ శాండల్ వుడ్ లో తిరుగులేని స్టార్డమ్ ఉంది. ఆ స్టార్డమ్ వల్లే ప్రశాంత్ నీల్ అతనితో కేజీఎఫ్ మూవీ చేయగలిగాడు. ఈ మూవీ రెండు పార్ట్స్ కోసం తన లైఫ్ లో దాదాపు ఐదేళ్లు టైమ్ ఇచ్చాడు. అది పదేళ్లకు పైగా క్రేజ్ ను తెచ్చింది. ఇమేజ్ తో పాటు రేంజ్ కూడా మారింది. ఇక కేజీఎఫ్‌ లాంటి మాసివ్ ప్యాన్ ఇండియన్ మూవీ చూసిన తర్వాత అతన్నుంచి ఎలాంటి కంటెంట్ వస్తుందా అని దేశమంతా చూస్తుంది కదా..? ఇక్కడే యశ్ భయపడ్డాడు. కథల ఎంపికలో తడబడ్డాడు.

ఏదీ సరిగా తేల్చుకోలేకపోయాడు. మళ్లీ ప్యాన్ ఇండియన్ స్టోరీతోనే రావాల్సిన తరుణంలో బాగా ఆలస్యం చేశాడు. ఈలోగా వరుసగా కొత్త ప్యాన్ ఇండియన్ స్టార్స్ పుట్టుకు వస్తూనే ఉన్నారు. మరీ లేట్ చేస్తే ఇలా వచ్చిన ఇమేజ్ అలా చేజారిపోతుంది. అయినా యశ్ కొత్త సినిమా విషయంలో ఏదీ త్వరగా తేల్చుకోలేకపోయాడు. ఒక దశలో రీసెంట్ గా మన హీరో గోపీచంద్ తో భీమా అనే సినిమా డైరెక్ట్ చేస్తోన్న కన్నడ దర్శకుడు ఏ హర్షతో సినిమా ప్రకటించారు కూడా. కానీ ఎందుకో అది ఆగిపోయింది. దీంతో యశ్ మరీ ఇంత పిరికివాడయ్యాడేంటీ అనుకుంటోన్న తరుణంలో ఫైనల్ గా నెక్ట్స్ ప్రాజెక్ట్ కు ఎస్ చెప్పాడు. అదీ ఓ లేడీ డైరెక్టర్ కు.


లేడీ డైరెక్టర్ అంటే తక్కువ అని అర్థం కాదు ఇక్కడ. బట్ ఇన్నాళ్ల తర్వాత భారీగా వస్తాడు అనుకుంటే ఇలా షాక్ ఇచ్చాడు అని మాత్రమే. ఇంతకు ముందు మూతన్ అనే సినిమాతో జాతీయ అవార్డ్ అందుకున్న గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో తన తర్వాతి సినిమా చేయబోతున్నాడు యశ్. ఈ కాంబినేషన్ లో సినిమా గురించి కూడా కొన్నాళ్లుగా శాండల్ వుడ్ లో రకరకాల వార్తలు వచ్చాయి. ఫైనల్ గా అవే నిజమయ్యాయి. గీతూ డైరెక్షన్లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు యశ్. విశేషం ఏంటంటే.. కేజీఎఫ్ తర్వాత యశ్ ను అంతా ఊరమాస్ హీరో అని భావిస్తుంటే ఈ డైరెక్టర్ మాత్రం ఓ ఫ్రెష్ లవ్ స్టోరీతో అప్రోచ్ అయిందట. ఈ విషయంలోనే కొంత సందిగ్ధంగా ఉన్న యశ్ .. చివరికి తన ఫైనల్ నెరేషన్ విన్న తర్వాత ఓకే చెప్పాడట. మరి ఈ మాస్ హీరో నుంచి క్లాస్ లవ్ స్టోరీకి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో..?

Related Posts