కాజల్ ఇది నిలబెట్టుకుంటుందా.. ?

కాజల్ అగర్వాల్.. దశాబ్ధం పాటు సౌత్ లో టాప్ హీరోయిన్ గా వెలిగింది. అందరు స్టార్ హీరోల సరసనా నటించింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో గ్లామర్ రోల్స్ లోనూ మెరిసింది. ఒక దశలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లైంది. అయితే పెళ్లి తర్వాత వెంటనే బిడ్డకు జన్మనివ్వడంతో కాజల్ ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టే అనుకున్నారు. బట్ డెలివరీ అయిన కొన్ని వారాల్లోనే తను జిమ్ మొదలుపెట్టింది. హార్స్ రైడింగ్ గట్రాలూ చేసి ఫిజిక్ ను పూర్వ స్థితికి తెచ్చుకుంది. ఇదంతా ఎందుకు అనుకున్నారు. రీ ఎంట్రీ కోసమే తర్వాత తెలిసింది. అయితే తన రీ ఎంట్రీ సౌండింగ్ అదిరిపోయిందనే చెప్పాలి.


తన బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన సత్యభామ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అటు ఫస్ట్ టైమ్ బాలకృష్ణకు జోడీగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తోంది. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన కాజల్ ఫస్ట్ లుక్ సైతం ఇంప్రెసివ్ గా ఉంది. ‘రీసెర్చ్ మెథడ్స్ ఇన్ సైకాలజీ’ అనే తను చదువుతోన్న బుక్ పేరు చూస్తే సినిమాలో తన పాత్ర ఎంత ఇట్రెస్టింగ్ గా ఉంటుందో అర్థం అవుతోంది. కాజల్ కమ్ బ్యాక్ కు సంబంధించిన సౌండ్ బావుందనే చెప్పాలి. అయితే ఈ సౌండ్ ను తను నిలబెట్టుకుంటుందా అనేదే పెద్ద డౌట్.


కాజల్ లాగానే పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సమంత అందులో పెద్దగా సక్సెస్ కాలేదు. కాజల్ ఇంకా ఒక అడుగు ముందుకు వేసి బిడ్డ పుట్టిన తర్వాత కూడా వస్తోంది. సత్యభామలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ లా కనిపిస్తోంది. నిజానికి ఇప్పటి వరకూ కాజల్ చేసిన పాత్రలు చూస్తే ఈ తరహా పాత్రల్లో ఆమెను ఊహించడం కష్టమే. కానీ బలమైన కంటెంట్ ఉన్నప్పుడు పాసై పోతుంది. అలా ఈ మూవీతో తను పాస్ అయిపోతే.. నయనతారలా సోలో హీరోయిన్ గానూ సత్తా చాటే ఛాన్స్ ఉంది. అయినా అదంత సులువైతే కాదు. ఇక బాలకృష్ణతో చేస్తోన్న భగవంత్ కేసరి మూవీ స్టిల్ కూడా గ్లామర్ కు దూరంగా ఉంది. సో.. ఇటు గ్లామర్ లేకుండా రాణించడం కూడా కష్టమే. అందువల్ల కాజల్ ఈ ఇన్నింగ్స్ ను నిలబెట్టుకోవడం కత్తిమీద సాములాంటిది అనే చెప్పాలి. ఒకవేళ నిలుపుకుందాం.. ? ఎంతోమందికి కొత్త దారి చూపిన లేడీలా ఇన్ స్పిరేషన్ గా నిలుస్తుంది.

Related Posts