ఈ దర్శకుడు రజినీకాంత్ కు హిట్ ఇస్తాడా..

సూపర్ స్టార్ రజినీకాంత్ కు బ్లాక్ బస్టర్ వచ్చి చాలాకాలం అయింది. ఆయన సినిమాలు వస్తున్నప్పుడల్లా ఫ్యాన్స్ అంతా ఉత్సాహంగా ఎదురుచూడటం.. అవన్నీ యావరేజ్ కాగానే నిరుత్సాహపడటం కామన్ అయింది. కొన్నాళ్ల క్రితం వచ్చిన కబాలి టీజర్ చూసి కంట్రీ మొత్తం షేక్ అవుతుందనుకున్నారు.

కానీ ఆయన పూర్తిగా కొత్త కంటెంట్ ట్రై చేశాడు. చాలా రోజుల తర్వాత తనలోని నటుడిని చూపించే ప్రయత్నం చేశాడు. బట్ ఫ్యాన్స్ తో ఆడియన్స్ కూడా ఆయన్నుంచి మాస్ నే కోరుకున్నారు. తర్వాత కూడా కబాలి దర్శకుడు పా రంజిత్ తోనే కాలా అనే సినిమా చేశాడు. ఇదీ పోయింది.

రోబోకు కొనసాగింపుగా శంకర్ తో చేసిన 2.0 అంచనాలను అందుకోలేదు. ఈ మూవీపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ హీరోనే విలన్ గా, విలన్ అని చెప్పిన అక్షయ్ కుమార్ నే హీరోగా భావించారు ప్రేక్షకులు. శంకర్ కన్‌ఫ్యూప్ అవడంతో ఫ్లాప్ అయింది.

ఇక తరువాత వరుసగా పేటా, దర్బార్, పెద్దన్న వంటి సినిమాలు వచ్చాయి. పోయాయి. కాకపోతే రజినీ మేనియా వల్ల ఇవి కమర్షియల్ గా డిజాస్టర్స్ అయితే కాదు. ఇన్ని యావరేజ్ ల తర్వాత ఇప్పుడు జైలర్ గా వస్తున్నాడు సూపర్ స్టార్.


జైలర్ కు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ఇతను నయనతారతో కొలమావు కోకిలతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు. తర్వాత శివకార్తికేయన్ తో చేసిన వరుణ్‌ డాక్టర్ తో విపరీతంగా మెప్పించాడు. దీంతో విజయ్ ఛాన్స్ ఇచ్చాడు. అతనితో చేసి బీస్ట్ మాత్రం డిజాస్టర్ అయింది. అయినా రజినీకాంత్ ఆఫర్ ఇచ్చాడు. అంటే ఈ సారి బలమైన కథే ఉందనుకుంటున్నారు జనం.

దీనికి తోడు ఈ చిత్రంలో రజినీతో పాటు భారీ తారాగణం ఉంది. మోహన్ లాల్, జాకీ ష్రాఫ్‌, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ, సునిల్, తమన్నా, అంటూ చాలామందే ఉన్నారు. ఇంతమంది ఉంటే కథ ఎటు పోతుంది అనే డౌట్ కూడా చాలామంది ఉంది. బట్ ఈ స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్ చేస్తున్నారు అంటున్నారు. అలా అయితే ఓకే. బట్ ఇప్పుడు రజినీకాంత్ అభిమానులు కూడా కమల్ హాసన్ కు విక్రమ్ లాంటి విజయాన్ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మరి ఆ హిట్ ను ఈ దర్శకుడు ఇస్తాడా లేదా అనేది ఈ నెల 11న తేలిపోతుంది.

Related Posts